
Radhika Apte Wedding Photos With Benedict Taylor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రైనా చేయడానికి వెనుకాడదు. విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే. అయితే ఈ బోల్డ్‌నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. హిందీలో ‘‘ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం 'విక్రమ్ వేదా' చిత్రంలో నటిస్తోంది. సినిమాల వరకు ఓకే కానీ తన పర్సనల్ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది రాధిక. అయితే తాజాగా ఆమె భర్తతో దర్శనమిచ్చిన రాధిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫొటోలు దిగరు.. ఎందుకు ?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాధిక ఆప్టే 'నేను ఇక్కడ.. బెన్ (భర్త బెనెడిక్ట్) అక్కడ. ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం నాకు ఇష్టముండదు. ఇక ఫొటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై అంతగా అభిరుచి లేదు. ఇక నాకన్న బెన్ ఇంకా వేస్ట్. ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావోస్తున్న ఇప్పటివరకూ మా పెళ్లి ఫొటోలు కూడా లేవు. మేము ఫ్రెండ్స్‌ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే. అయినా మాకు ఫొటోలు దిగేంత ఆసక్తి కలగలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు.
చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా!
బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు..
Comments
Please login to add a commentAdd a comment