
సెన్సేషన్ బ్యూటీగా రాధికా ఆప్టేకు పేరుంది. ధోని చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు తన సత్తా చాటుకుంటోంది. ఈమె నటనే కాదు భావాలు సంచలనంగా ఉంటాయి. తాను అనుకున్నది నిర్భయంగా వ్యక్తం చేసే నటి ఈమె. అదే విధంగా హీరోలతో సమానంగా హీరోయిన్‌కు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి
ఇలా తరచూ వార్తల్లో నిలిచే ఆమె తాజాగా సమానత్వం గురించి ఒక భేటీలో మాట్లాడింది. ఆడ, మగ వారి వారి వృత్తిలో సమానంగా సంపాదిస్తున్న రోజులివి. అయినప్పటికీ ఉద్యోగం ముగించుకుని ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులకు అవసరం అయిన అన్నింటినీ సమకూర్చుతుంది.. ఇదేం సమానత్వం? నా తండ్రికి ఆసుపత్రి ఉంది, అందులో తన తల్లి సేవలు అందించేవారు.
అయితే ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించేది. ఇలా ఆడవారే ఇంటి పనులు చేయాలని వారి బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. మహిళలు అంతగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా తలా ఒక పనిచేస్తే సరిపోతుంది అంటూ రాధిక ఆప్టే పేర్కొంది. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment