అమలా పరిణయం | Amala Paul Gets Married to Singer Bhavinder Singh | Sakshi
Sakshi News home page

అమలా పరిణయం

Published Sat, Mar 21 2020 6:22 AM | Last Updated on Sat, Mar 21 2020 6:22 AM

Amala Paul Gets Married to Singer Bhavinder Singh - Sakshi

అమలా పాల్, భవీందర్‌

ఏఎల్‌ విజయ్‌తో విడిపోయిన తర్వాత తన రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ప్రతీ విషయాన్ని రహస్యంగా ఉంచారు అమలా పాల్‌. ప్రేమలో ఉన్నానంటారు కానీ ఆ విషయాలేవీ బయటకు చెప్పలేదు. అయితే ముంబైకు చెందిన సింగర్‌ భవీందర్‌ సింగ్‌తో అమల ప్రేమలో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారనే విషయం కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చింది. తాజాగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం బయటకు వచ్చింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు భవీందర్‌. ప్రస్తుత పరిస్థితులను (కరోనా) అనుసరించి కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి చేసుకున్నారని సమాచారం. అయితే పెళ్లి ఫొటోలను షేర్‌ చేసిన కొన్ని నిమిషాలకే  ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తొలగించారు భవీందర్‌.  

అమలా పాల్, భవీందర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement