రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే | Mystery Around Amala Pauls Marriage | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లి చేసుకోలేదు.. అవి ఫోటో షూట్ అంతే

Published Tue, Mar 24 2020 10:28 AM | Last Updated on Tue, Mar 24 2020 11:01 AM

Mystery Around Amala Pauls Marriage - Sakshi

ఏఎల్ విజయ్ తో విడిపోయిన తర్వాత తన రిలేషన్ కి సంబంధించిన ఏ విషయాన్ని బయటకిచెప్పలేదు అమలాపాల్. నటి అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త  భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో మాట్లాడింది. తనరెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్‌లో ఉన్న ఫోటోలు నేను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫోటో షూట్‌ కోసం అని స్పష్టంచేసింది.

అయితే గత కొద్ది రోజుల కింద ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది. కాగా..చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. దర్శకుడు విజయ్‌తో విడిపోయాక అమల కొత్త జీవితం కోసం ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలోనే చివరికి భవీందర్‌తో ప్రేమాయణం కూడా.. ఇప్పుడు అది కూడా పెళ్లికి చేరకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement