
ఏదైనా పని చేపట్టినపుడు దానిమీదే దృష్టి మొత్తం కేంద్రీకరించినప్పుడు ఫలితం తొందరగా దరిచేరుతుందంటారు. అంతేకాదు మనకు నచ్చిన పనిలో ఎంత కష్టం ఉన్నా అది ఇష్టంగానే అనిపిస్తుంది. దానిపై ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకెళ్తాము. ఒక్కోసారి దాని కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనకాడం. అందుకు నిదర్శనంగా ఈ ఫొటోగ్రాఫర్‌ని చెప్పుకోవచ్చు.
అసలు విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఫొటోలు తీయించుకోవడానికి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌కి కబురు పెట్టారు. దీంతో ఫోటోగ్రాఫర్ వచ్చి నవ దంపతులకు ఫోటో షూట్ చేశాడు. అయితే అతను ఫొటోలు తీసే విధానం చూసి ఆ దంపతులే కాదు.. నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఆ ఫొటోగ్రాఫర్ వారిద్దరినీ ఓ చెట్టు కింద నిలబడమని చెప్పి అతను ఓ చెట్టు ఎక్కాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ మరీ వారి ఫొటో తీశాడు. ఆ ఫొటో కూడా చాలా చక్కగా వచ్చింది.
ఇలా ఫొటో తీస్తున్న వీడియోను రాజబాబు అనే నెటిజన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘నేరాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పైడర్ మ్యాన్ కావాలనుకున్నప్పుడు.. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఫొటోగ్రాఫర్ అయితే ఇలాగే ఉంటుంది’ అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా.? ఫొటోగ్రాఫరా.? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఫోటో షూట్ ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియదు.


Comments
Please login to add a commentAdd a comment