Hangs
-
స్టార్ హోటల్ బాల్కనీలో ఎండకు బట్టలు : అయితే ఏంటట? వీడియో వైరల్
నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్‌కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pallavi Venkatesh (@iam.pallavivenkatesh) అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను దక్కించు కోవడం విశేషం. -
స్పైడర్ మ్యాన్ ఫొటోగ్రాఫర్..!
-
వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా? ఫొటోగ్రాఫరా?
ఏదైనా పని చేపట్టినపుడు దానిమీదే దృష్టి మొత్తం కేంద్రీకరించినప్పుడు ఫలితం తొందరగా దరిచేరుతుందంటారు. అంతేకాదు మనకు నచ్చిన పనిలో ఎంత కష్టం ఉన్నా అది ఇష్టంగానే అనిపిస్తుంది. దానిపై ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకెళ్తాము. ఒక్కోసారి దాని కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనకాడం. అందుకు నిదర్శనంగా ఈ ఫొటోగ్రాఫర్‌ని చెప్పుకోవచ్చు. అసలు విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఫొటోలు తీయించుకోవడానికి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌కి కబురు పెట్టారు. దీంతో ఫోటోగ్రాఫర్ వచ్చి నవ దంపతులకు ఫోటో షూట్ చేశాడు. అయితే అతను ఫొటోలు తీసే విధానం చూసి ఆ దంపతులే కాదు.. నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఆ ఫొటోగ్రాఫర్ వారిద్దరినీ ఓ చెట్టు కింద నిలబడమని చెప్పి అతను ఓ చెట్టు ఎక్కాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ మరీ వారి ఫొటో తీశాడు. ఆ ఫొటో కూడా చాలా చక్కగా వచ్చింది. ఇలా ఫొటో తీస్తున్న వీడియోను రాజబాబు అనే నెటిజన్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేరాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పైడర్ మ్యాన్ కావాలనుకున్నప్పుడు.. తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఫొటోగ్రాఫర్ అయితే ఇలాగే ఉంటుంది’ అని సరదాగా ట్వీట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడెవడండీ బాబు.. స్పైడర్ మ్యానా.? ఫొటోగ్రాఫరా.? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఫోటో షూట్ ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియదు. -
మీర్పేట్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
-
ప్రియురాలి భర్తకు చిక్కకూడదని ఇలా...
-
ఉరిశిక్ష రద్దు చేసి ... మళ్లీ అమలు చేశారు
ఇస్లామాబాద్: దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురి ఖైదీలకు పాక్ ప్రభుత్వం మంగళవారం ఉరి శిక్షను అమలు చేసింది. 2008లో చోరీ చేసి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు మహమ్మద్ రియాజ్‌కు ప్రభుత్వం సర్గోదా జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. అలాగే మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. నగదు డిమాండ్ చేయడంతో అక్రం ఉల్ హక్‌ను అటాక్ జైలులో ఉరి వేశారు. నిందితుడు అక్రంపై కిడ్నాప్, నగదు డిమాండ్, తీవ్రవాదం తదితర కేసులు అక్రంపై నమోదై ఉన్నాయి. వ్యక్తిగత కక్షతో హత్య చేసిన కేసులో మహ్మద్ అమీన్‌ను రావల్పిండిలోని అడియాల జైలులో ఉరి తీశారు. సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుబ్దార్ షాకు ఉరి శిక్షను ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. అయితే గతేడాది డిసెంబర్లో పెషావర్‌లో తీవ్రవాదులు ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి 140 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఉరి శిక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో సుబ్దార్ షాకు జైలు శిక్ష అమలు చేశారు. ఈ మేరకు డాన్ అన్లైన్ పత్రిక వెల్లడించింది. -
అత్యాచారాలపై ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు
-
అత్యాచారం చేస్తే ఉరితీస్తారా?: ములాయం
మొరాదాబాద్: అత్యాచారం చేస్తే ఉరితీస్తారా అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలు చేసి తాజాగా వివాదంలో కూరుకుపోయారు. రేపిస్టులకు అనుకూలంగా ములాయం వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో గతవారం రెండు గ్యాంగ్ రేప్ లకు సంబంధించిన కేసుల్లో నిందితులకు మరణశిక్ష వేయడంపై ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ కేసులో మరణశిక్ష వేయడమే పరిష్కారమా? వాళ్లు యువకులు. యువకులు తప్పు చేస్తారు అంటూ మొరాదాబాద్ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని శక్తి మిల్స్ లో ఓ ఫోటో జర్నలిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్ పై జరిగిన అత్యాచారం కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు విబేధాలు వస్తాయి. దాంతో అమ్మాయిలు వెళ్లి అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేస్తారు. పాపం యువకులు ముగ్గురికి మరణ శిక్ష వేశారని ములాయం వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేస్తే మరణశిక్షేనా అంటూ తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వస్తే చట్టాలను మారుస్తాం. తప్పుడు కేసులు పెట్టేవారిపై కూడా శిక్షలు వేస్తామని పరోక్షంగా మహిళపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులో వేస్తున్న శిక్షలపై, విధిస్తున్న చట్టాలను ములాయం ప్రశ్నించడం కొత్త వివాదానికి దారితీసింది. తాను అధికారంలోకి వస్తే అత్యాచారం కేసులకు సంబంధించిన చట్టాలను మారుస్తానని ములాయం అన్నారు. రేపిస్టులకు ములాయం బాసటగా నిలవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పలు మహిళా సంఘాలు ఎలక్షన్ కమిషన్, జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. -
కలకలం రేపుతున్న విద్యార్ధి మరణం