ఉరిశిక్ష రద్దు చేసి ... మళ్లీ అమలు చేశారు
ఇస్లామాబాద్: దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురి ఖైదీలకు పాక్ ప్రభుత్వం మంగళవారం ఉరి శిక్షను అమలు చేసింది. 2008లో చోరీ చేసి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు మహమ్మద్ రియాజ్కు ప్రభుత్వం సర్గోదా జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. అలాగే మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. నగదు డిమాండ్ చేయడంతో అక్రం ఉల్ హక్ను అటాక్ జైలులో ఉరి వేశారు. నిందితుడు అక్రంపై కిడ్నాప్, నగదు డిమాండ్, తీవ్రవాదం తదితర కేసులు అక్రంపై నమోదై ఉన్నాయి.
వ్యక్తిగత కక్షతో హత్య చేసిన కేసులో మహ్మద్ అమీన్ను రావల్పిండిలోని అడియాల జైలులో ఉరి తీశారు. సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుబ్దార్ షాకు ఉరి శిక్షను ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. అయితే గతేడాది డిసెంబర్లో పెషావర్లో తీవ్రవాదులు ఆర్మీ స్కూల్పై దాడి చేసి 140 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఉరి శిక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దాంతో సుబ్దార్ షాకు జైలు శిక్ష అమలు చేశారు. ఈ మేరకు డాన్ అన్లైన్ పత్రిక వెల్లడించింది.