నగరాల్లోని అపార్టమెంట్లలో ఉండేవాళ్లు బట్టలు బాల్కనీలోనే ఆరేసుకోవాలి తప్పదు. కానీ స్టార్ హోటల్ అయినా, లగ్జరీ హోటల్ అయినా హోటల్‌కి వెళ్లినపుడు, తడి బట్టలు ఎక్కడ ఆరేయాలి. ఇది టూర్లలో, ప్రతీ తల్లికి ఉండే ఇబ్బందే. (ఎందుకంటే బట్టలు ఆరేయడం గురించి మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు కాబట్టి) అయినా తప్పదు ఆరేయ్యాలి కదా.. తడి బట్టలు అలాగే పట్టుకెళ్లలేం. ముక్కి, వాసన వస్తాయి అందుకేనేమో దుబాయ్ వెళ్లిన ఒక తల్లి బట్టలు ఆరేయడం ఇంటర్నెట్‌లో చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టోరీ ఏంటంటే..
ఇండియాకు చెందిన ఒక కుటుంబం దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అత్యంత ప్రసిద్దమైన, విలాసవంతమైన ‘అట్లాంటిస్, ది పామ్’ హోటల్‌లో దిగారు. అక్కడ పొద్దున్నే బాల్కనీలో మహిళ దుస్తులు ఆరేసింది. తన తల్లి బట్టలు ఆరేసిన వీడియోను పల్లవి వెంకటేశ్ అనే యువతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘పొద్దున్నే అమ్మ పని ఇది’ అంటూ ఫన్నీగానే వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎక్కడైనా అమ్మ.. అమ్మే..తన బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోదు అని కొందరు కామెంట్ చేశారు. హాటల్‌లో అలా చేయడం మర్యాద కాదని కొందరు, ఈ అమ్మలు ఇంతే మారరు అని మరికొందరు కమెంట్ చేశారు.
అయితే హోటల్ యాజమాన్యం స్పందన విశేషంగా నిలిచింది. తల్లి బాధ్యతలు అని కామెంట్ చేసింది. అలాగే దుస్తులు ఆరేసుకునేందుకు ప్రతి బాత్రూంలో డ్రైయింగ్ త్రాడును చేర్చుతాం తద్వారా అక్కడే దుస్తులను ఆరబెట్టుకోచ్చు అనే కూడా వివరణ ఇచ్చారు. ఏడు రోజుల కిందట పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 12 మిలియన్ల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను దక్కించు కోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment