తుఫానులో పెళ్లి.. ముద్దు సీన్‌ అదుర్స్‌ | Harvey Ruined Their Wedding Plans. This Is How They Got Married | Sakshi
Sakshi News home page

తుఫానులో పెళ్లి.. ముద్దు సీన్‌ అదుర్స్‌

Published Fri, Sep 8 2017 3:34 PM | Last Updated on Tue, Sep 12 2017 2:16 AM

Harvey Ruined Their Wedding Plans. This Is How They Got Married



టెక్సాస్‌: పెళ్లి అంటే ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఓ పెద్ద వర్షం వచ్చి వెళ్లినట్లుంటుంది హడావుడి. సాధారణంగా పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లకయితే ఇరు కుటుంబ పెద్దలు మాత్రమే కష్టపడుతూ హైరానాపడుతూ ఉంటారు. ఇక పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మాత్రం కొంత ఉత్సాహంతో మిత్రులతో ఆ విషయాన్ని పంచుకుంటూ సందడిగా కనిపిస్తారు. అదే పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అయితే మాత్రం పెద్దలకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ జంట పరుగులు పెడుతుంటారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన షెల్లీ, క్రిస్‌ హాలాండ్‌ అనే జంటది కూడా ఈ కోవకు చెందిన వివాహమే.

సెప్టెంబర్‌ 2న జరగాల్సిన వారి వివాహం కోసం దాదాపు ఆరునెలలు ప్లాన్‌ చేసుకున్నారు. ఒక్కొక్కటి శ్రద్ధగా సమకూర్చుకొని రెడీ అయిపోయారు. కానీ, వారి ఆశలు అడియాశాలయ్యాయి. అంగరంగ వైభవంగా, అతిధుల మధ్య జరుపుకోవాల్సిన వివాహం ఓ నలుగురికే పరిమితమైంది. ఓ విందు భోజనం లేదు.. ఓ ఆటపాట లేదు. కానీ, వారు పెళ్లి చేసుకున్న విధానం మాత్రం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. అరకొరగా జరిగిన ఆ వివాహానికి సంబంధించిన ఓ ఫొటోను ఆ జంట ఫేస్‌బుక్‌లో పంచుకోగా దాదాపు 20వేల షేర్లు, నాలుగు లక్షలమంది ప్రతిస్పందనలు వచ్చాయి. ఇంతకీ వారి పెళ్లికి ఏ అడ్డంకి ఎదురైందనుకుంటున్నారా.. హార్వీ. మొన్నటికి మొన్న వచ్చిన పెను తుఫాను అమెరికాలో పలు నగరాలను ముంచెత్తిన విషయం తెలిసిందే.

దీని ప్రభావం షెల్లీ దంపతుల వివాహం పై పడింది. 'నేను, నా భర్త ఆరు నెలలుగా చేసుకున్న ప్రణాళిక మొత్తం తుఫాను హార్వీ వల్ల నాశనమై పోయింది. మా వివాహ కేకు, వివాహ చోటు, క్యాటరింగ్‌, బంధువులు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా నష్టం జరిగింది' అంటూ హాలాండ్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొంటూ ఓ పెళ్లి ఫొటోను పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలో దాదాపు మొకాళ్ల వరకు నీళ్లు రాగా పెళ్లి కొడుకు షెల్లీ నవ వధువు అయిన క్రిస్‌ హాలండ్‌ను పైకి ఎత్తుకోగా ఇద్దరు గాఢ చుంబనంలో మునిగిపోయారు. ఎంత ఉధృతంగా ఎన్ని హార్వీలు వచ్చినా మిమ్మల్ని మాత్రం విడదీయలేవని చెబుతున్నామంటూ ఈ ఫొటో చూసిన వారంతా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement