Vignesh Shivan Nayanthara Shares Unseen Wedding Photos - Sakshi
Sakshi News home page

Vignesh Shivan-Nayanthara: వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్‌ స్టార్స్‌

Published Mon, Jul 11 2022 3:24 PM | Last Updated on Mon, Jul 11 2022 4:07 PM

Nayanthara Hubby Director Vignesh Shivan Shares Wedding Photos On Instagram - Sakshi

ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్‌ బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతార గత నెల అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చెన్నైలోని మహాబలిపురంలో జూన్‌ 9న గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది. వీరి పెళ్లి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌ సేతుపతి, కార్తీ, సూర్య దంపతులతో పాటు కోలీవుడ్‌కు చెందిన ఇతర హీరోలు, నటీనటులు సందడి చేశారు.

చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్‌

అయితే ఈ జంట పెళ్లై నెల గడిచిన ఇప్పటికి వీరి పెళ్లి ఫొటోలు కానీ, వీడియోలు కానీ పెద్దగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో నయన్‌ భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ వరుసగా తమ పెళ్లి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంటున్నాడు. ఈ ఫొటోలు షారుక్‌, విజయ్‌ సేతుపతి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ ఇతర నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి: సల్మాన్‌ ఖాన్‌ను మా వర్గం ఎప్పటికి క్షమించదు: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement