Cricketer Shreyas Gopal Marries Long Time Girlfriend Nikitha Pics Goes Viral: కర్ణాటక ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నిఖితను గురువారం పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రేయస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో అభిమానుల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా బెంగళూరుకు చెందిన శ్రేయస్ గోపాల్ ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్‌లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక రాజస్తాన్ ప్లేఆఫ్స్‌నకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment