Shreyas Gopal
-
CSK Vs MI: హార్దిక్ చెత్త కెప్టెన్సీ.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
ముంబై ఇండియన్స్‌తో జత కట్టాక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ సీజన్లో ముంబై ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైంది. బౌలర్లను మర్చే విషయంలో, బాగా బౌలింగ్ చేస్తున్న వారిని వాడుకునే విషయంలో హార్దిక్ పూర్తిగా తేలిపోయాడు. బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించడం, చివరి ఓవర్లలో తనే బౌలింగ్‌కు దిగడం (సీఎస్కేతో మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు) వంటి పిల్ల చేష్టలు ముంబై ఇండియన్స్ కొంప ముంచుతున్నాయి. ఇలాంటివన్నీ చూస్తే.. హార్దిక్ అయిష్టంగా ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరిస్తున్నాడన్న విషయం క్రికెట్ పరిజ్ఞానం లేని వారికి సైతం స్పష్టంగా అర్దమవుతుంది. హార్దిక్ కెప్టెన్సీలో లోపాలు తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనూ బహిర్గతం అయ్యాయి. ఆర్సీబీతో మ్యాచ్ నుంచి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న శ్రేయస్ గోపాల్‌ను కాదని పార్ట్ టైమ్ బౌలర్ రొమారియో షెపర్డ్‌పై ఎక్కువగా ఆధారపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ బౌలర్ అయిన శ్రేయస్ గోపాల్‌తో ఒకే ఒక ఓవర్ వేయించడం కెప్టెన్‌గా హార్దిక్ అనుభవలేమికి అద్దం పడుతుంది. Feel for Shreyas Gopal 😔 Bowling Brilliantly since RCB Match, But got only 1 over vs CSK 😳 Why Romario Shepherd instead of Shreyas Gopal, Seems Captaincy Blunder by Hardik Pandya 🤐#MIvCSK #CSKvsMI pic.twitter.com/ycTlRNJD5Y — Richard Kettleborough (@RichKettle07) April 14, 2024 సీఎస్కేతో మ్యాచ్‌లో శ్రేయస్ ఒకే ఒక ఓవర్ వేసినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలకమైన రచిన్ రవీంద్ర వికెట్ పడగొట్టాడు. బాగా బౌలింగ్ చేస్తున్న వారిని వినయోగించుకోకపోవడం హార్దిక్‌కు కొత్తేమీ కాదు (ఈ సీజన్లో). గత మ్యాచ్‌ల్లో అతను బుమ్రా విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బుమ్రాను కాదని తానే బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించడం.. కీలక దశలో అనుభవజ్ఞుడైన బుమ్రా సేవలను వినియోగించుకోకపోవడం వంటివి చూశాం. ఈ సీజన్లో హార్దిక్ అవళంభిస్తున్న తలతిక్క నిర్ణయాల వల్లే గతమెంతో ఘనంగా ఉన్న ముంబై ఇండియన్స్ ప్రతిష్ట దెబ్బ తింటుంది. రోహిత్ విషయంలో హార్దిక్‌పై ఇప్పటికే గుర్రుగా ముంబై అభిమానులు ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌లో హార్దిక్ నిర్ణయాలే ముంబై కొంపముంచుతున్నాయని ఆరోపిస్తున్నారు. కాగా, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ అజేయ సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కినప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ధోని (4 బంతుల్లో 20 నాటటౌ్; 3 సిక్సర్లు) హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్ల బాదడంతో సీఎస్కే 200 పరుగుల మార్కును తాకింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని ఆఖరి ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయని నెటిజన్లు అనుకుంటున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ ముంబై ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. -
బౌలర్ల విజృంభణ.. శ్రేయస్ అజేయ శతకం.. సెమీస్‌లో మయాంక్ జట్టు
Karnataka won by an innings and 281 runs: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో కర్ణాటక సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఉత్తరాఖండ్‌ను ఇన్నింగ్స్ మీద 281 పరుగులతో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెంచరీ హీరో శ్రేయస్ గోపాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మయాంక్ నమ్మకాన్ని నిలబెట్టి బెంగళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో జనవరి 31న మొదలైన క్వార్టర్ ఫైనల్-3లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నమ్మకాన్ని నిలబెడుతూ.. కర్ణాటక బౌలర్లు సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. రైట్ ఆర్మ్ పేసర్, 22 ఏళ్లమురళీధర వెంకటేశ్ ఐదు వికెట్లతో ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. విద్వత్ కవెరప్ప, క్రిష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీశారు. విజయ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 116 పరుగులకే ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రెచ్చిపోయిన కర్ణాటక బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక బ్యాటర్లు ఉత్తరాఖండ్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించారు. ఓపెనర్లు సమర్థ్(82), మయాంక్ అగర్వాల్(83) అర్థ శతకాలతో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 69 పరుగులతో రాణించాడు. శ్రేయస్ గోపాల్ అద్భుత సెంచరీ నాలుగో స్థానంలో వచ్చిన నికిన్ జోస్ 62 రన్స్ సాధించగా.. మనీశ్ పాండే 39 పరుగులతో ఫర్వాలేదనపించాడు. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝలిపించడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా 288 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 161 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శరత్ 33, గౌతం 39, వెంకటేశ్ 15 పరుగులు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక 606 పరుగులకు ఆలౌట్ అయింది. సెమీస్‌లో అడుగు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ కథ 209 పరుగులకే ముగిసింది. దీంతో శుక్రవారం నాటి(ఫిబ్రవరి 3) ఆఖరి రోజు ఆటలో కర్ణాటక జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచిన కన్నడ జట్టు తాజా సీజన్లో సెమీస్‌కు చేరుకుంది. చదవండి: Ranji Trophy 2022-23: విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్స్‌లో ఓటమిపాలైన ఆంధ్ర BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
శ్రేయస్ గోపాల్ సెంచరీ.. విహారి వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్‌లో జార్ఖండ్-బెంగాల్, రెండో మ్యాచ్‌లో సౌరాష్ట్ర-పంజాబ్, మూడో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్-కర్ణాటక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్ అయినా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్‌కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్ గోపాల్ సూపర్ సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలి క్వార్టర్ ఫైనల్ జార్ఖండ్ వర్సెస్ బెంగాల్.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్ జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 173 ఆలౌట్ (కుమార్ సూరజ్ 89 నాటౌట్, ఆకాశదీప్ 4/46) బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 238/5 (అభిమన్యు ఈశ్వరన్ 77, సుప్రయో చక్రవర్తి 2/68) రెండో క్వార్టర్ ఫైనల్ సౌరాష్ట్ర-పంజాబ్.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 303 ఆలౌట్ (పార్థ భట్ 111 నాటౌట్, మార్కండే 4/84) పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 327/5 (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 126, నమన్ ధీర్ 131, యువ్‌రాజ్ సింగ్ 2/63) మూడో క్వార్టర్ ఫైనల్ ఉత్తరాఖండ్-కర్ణాటక.. 358 పరుగుల లీడ్‌లో కర్ణాటక ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 116 ఆలౌట్ (కునాల్ చండీలా 31, ఎం వెంకటేశ్ 5/36) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 474/5 (శ్రేయస్ గోపాల్ 103 నాటౌట్, మయాంక్ మిశ్రా 3/98) నాలుగో క్వార్టర్ ఫైనల్ ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 379 ఆలౌట్ (రికీ భుయ్ 149, కరణ్ షిండే 110, అనుభవ్ అగర్వాల్ 4/72) మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 144/4 (శుభమ్ శర్మ 51, శశికాంత్ 2/37) -
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..!
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్ దశలోనే ఎస్ఆర్హెచ్ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్‌ను ఓటములతో ఆరంభించిన ఎస్ఆర్హెచ్.. సీజన్ మధ్యలో వరుసగా ఐదు విజయాలు సాధించి హైదరాబాద్ తిరిగి గాడిలో పడింది. అయితే తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక డేవిడ్ వార్నర్ తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేన్ విలియమ్సన్.. జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా విలియమ్సన్ నిరాశపరిచాడు.13 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 216 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ విఫలమైనప్పటికీ కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ అత్యుత్తమంగా రాణించారు. ఇక మరి కొంత మంది ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఓ ముగ్గురి ఆటగాళ్లని ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల పేసర్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. సీన్ అబాట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడిన అనుభవం ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు అబాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ ఏడాది సీజన్లో అతడికి చాలా తక్కువ అవకాశాలు లభించాయి. కేవలం ఒకే మ్యాచ్ ఆడిన అబాట్.. తన నాలుగు ఓవర్ల కోటాలో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడికి తర్వాత మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్క లేదు. ఇప్పటికే నటరాజన్, భవనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండటంతో రాబోయే సీజన్‌కు ముందు అబాట్‌ను ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది. ఫజల్హక్ ఫారూఖీ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గత కొద్ది కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో ఫారూఖీని రూ. 50 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. కాగా ఫారూఖీ మాత్రం ఐపీఎల్లో రాణించడంలో విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని విడిచి పెట్టి మరో కొత్త పేసర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేయచ్చు. శ్రేయస్ గోపాల్ ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్ గోపాల్‌ను మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే జట్టులో వాషింగ్టన్ సుందర్, జగదీషా సుచిత్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో గోపాల్ పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన గోపాల్.. 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఇక వికెట్ సాధించాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో గోపాల్ స్థానంలో ఓ యువ ఆటగాడిని భర్తీ చేసే అవకాశం ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాను భయపెడుతోన్న దక్షిణాఫ్రికా త్రయం.. గెలవడం అంత ఈజీ కాదు..! -
Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్.. ఫొటోలు వైరల్
Cricketer Shreyas Gopal Marries Long Time Girlfriend Nikitha Pics Goes Viral: కర్ణాటక ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నిఖితను గురువారం పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రేయస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో అభిమానుల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బెంగళూరుకు చెందిన శ్రేయస్ గోపాల్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక రాజస్తాన్ ప్లేఆఫ్స్‌నకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో -
Shreyas Gopal Marriage Photos: ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్ శ్రేయస్ గోపాల్
-
'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే'
ఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో ఎలా ఆడుతున్నాడనేది పక్కనపెడితే మంచి ఎంటర్టైన్ అందిస్తున్న ఆటగాళ్లలో ఒకడు. మొన్న బిహూ డ్యాన్స్‌తో అలరించిన పరాగ్.. నిన్న రాహుల్ తెవాటియాతో కలిసి మైదానంలోనే సెల్ఫీ సెలబ్రేషన్ అంటూ రచ్చ రచ్చ చేశాడు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్‌ను .. అతని హావభావాలతో అనుకరించాడు. విషయంలోకి వెళితే.. పరాగ్ తన సహచరుడైన శ్రేయాస్ గోపాల్‌తో కలిసి గెస్సింగ్ గేమ్ ఆడాడు. పరాగ్ యాక్ట్ చేసి చూపిస్తుంటే.. గోపాల్ వారి పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఈలోగా సెహ్వాగ్ వంతు వచ్చింది. పరాగ్ సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ ఆటకు సిద్ధమవుతున్నట్లుగా యాక్టింగ్ చేశాడు. శ్రేయాస్ గోపాల్ ఎంత ప్రయత్నించినా సెహ్వాగ్ పేరు చెప్పలేకపోయాడు. దీంతో పరాగ్ మరో అడుగు ముందుకేసి సెహ్వాగ్ ట్రేడ్‌మార్క్ షాట్ స్క్వేర్కట్ను చూపించాడు. ఈసారి మాత్రం గోపాల్ కరెక్ట్‌గా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కైసా లగా..'' అంటూ వీరు పేరును ట్యాగ్ చేసి క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ''పరాగ్ జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే'' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. కాగా పరాగ్ ఈ సీజన్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనను నమోదు చేయలేదు. ఆరు మ్యాచ్‌లాడి 63 పరుగులు మాత్రమే చేసిన అతను బౌలింగ్‌లోనూ ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటతీరు పడుతూ లేస్తు అన్నట్లుగా తయారైంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడి 2 విజయాలు.. నాలుగు ఓటములతో ఏడో స్థానంలో నిలిచింది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌లో మే2న ఎస్ఆర్హెచ్ను ఎదుర్కోనుంది. చదవండి: పూరన్ చెత్త రికార్డు.. ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు? Kaisa laga, @virendersehwag? 😄#HallaBol | #RoyalsFamily | @ParagRiyan | @ShreyasGopal19 pic.twitter.com/eh2rmDK7RQ — Rajasthan Royals (@rajasthanroyals) May 1, 2021 -
'గోపాల్.. నా కంటే నువ్వే బాగా వేశావు'
ముంబై: రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు శ్రేయాస్ గోపాల్ బుమ్రా, హర్భజన్, అశ్విన్‌ల బౌలింగ్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 14వ సీజన్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ జట్టు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. నేడు ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్ అమీతుమి తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రేయాస్ గోపాల్ ప్రాక్టీస్ సమయంలో తన చర్యలతో జట్టు ఆటగాళ్లను ఎంటర్టైన్ చేశాడు. ముందుగా బుమ్రాను అనుకరించిన అతను.. అచ్చం అతని బౌలింగ్ యాక్షన్‌ను దింపేశాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌ను అనుకరించేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రేయాస్ లెగ్ స్పిన్నర్ కావడంతో అశ్విన్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను సరిగా చేయలేకపోయాడు. అయితే భజ్జీ విషయంలో మాత్రం గోపాల్ తన టైమింగ్‌ను తప్పలేదు. లెగ్ స్పిన్నర్ అయిన అతను భజ్జీ ఆఫ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చం అతని లాగే దింపి అలరించాడు. ఆ తర్వాత తాను బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అతనికి చూపించగా.. నా బౌలింగ్‌ను నా కంటే బాగా నువ్వే వేశావు... సూపర్ ఇమిటేషన్ అని చెప్పినట్లు గోపాల్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక 2018 నుంచి రాజస్తాన్ రాయల్స్‌తో కొనసాగుతున్న అతను లెగ్ స్పిన్నర్‌గా ఆ జట్టుకు కీలకంగా మారాడు. అంతకముందు గోపాల్ 2014- 2018 వరకు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. బుమ్రా, హర్భజన్లతో కలిసి ఆడిన గోపాల్ వారి బౌలింగ్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 1 విజయం.. రెండు ఓటములతో ఏడో స్థానంలో నిలిచింది. నేటి మ్యాచ్‌లో పటిష్టమైన ఆర్సీబీని ఎదుర్కోనున్న రాజస్తాన్ వారిని ఏ మేర నిలువరిస్తుందో చూడాలి. చదవండి: వైరల్: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! J̶a̶s̶p̶r̶i̶t̶.̶ ̶R̶a̶v̶i̶c̶h̶a̶n̶d̶r̶a̶n̶.̶ ̶H̶a̶r̶b̶h̶a̶j̶a̶n̶.̶ Shreyas Gopal ✅💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/I3hSeE8hJF — Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2021 -
వావ్ శ్రేయస్.. మరోసారి అదరగొట్టాడు!
శ్రేయస్ గోపాల్ మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. భారీ వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియం చెరువును తలపించింది. దీంతో చివరకు 30-30 బాల్స్ (5 ఓవర్ల) మ్యాచ్‌ను ఆడించారు. 30 బంతుల మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ శ్రేయస్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ వేసిన శ్రేయస్.. మొదటి మూడు బంతులకు 6, 4, 2 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ తన బౌలింగ్ మాయాజాలంతో హ్యాట్రిక్ వికెట్లు తీసి మెరుపులకు కళ్లెంవేశాడు. వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టిన కోహ్లి నాలుగో బంతినీ బాదేందుకు ప్రయత్నించాడు. లాంగాన్‌లో లివింగ్‌స్టోన్ క్యాచ్ పట్టడంతో కోహ్లి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతికే డివిలియర్స్ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటవ్వగా.. స్టొయినిస్ డకౌట్ కావడంతో ఈ సీజన్లో రెండో ‘హ్యాట్రిక్’ నమోదైంది. చివరకు మళ్లీ వర్షం రావడంతో ఈ మ్యాచ్ రద్దయింది. ఐపీఎల్లో ఒకే సీజన్లో కోహ్లి, డివిలియర్స్‌లను మూడేసి సార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా శ్రేయస్ గోపాల్ నిలిచాడు. కోహ్లి, డివిలియర్స్ వంటి బ్యాట్స్‌మెన్‌ను వెనువెంటనే ఔట్ చేసిన శ్రేయస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 19వ హ్యాట్రిక్.. ఐపీఎల్ చరిత్రలో ‘హ్యాట్రిక్’ తీసిన 16వ బౌలర్ శ్రేయస్ గోపాల్. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో మొత్తం 19 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అమిత్ మిశ్రా (ఢిల్లీ, డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్) మూడుసార్లు... యువరాజ్ సింగ్ (పంజాబ్) రెండుసార్లు ఈ ఘనత సాధించారు. లక్ష్మీపతి బాలాజీ (చెన్నై), ఎన్తిని (చెన్నై), రోహిత్ శర్మ (డెక్కన్ చార్జర్స్), ప్రవీణ్ కుమార్ (బెంగళూరు), అజీత్ చండేలా (రాజస్తాన్), సునీల్ నరైన్ (కోల్‌కతా), ప్రవీణ్ తాంబే (రాజస్తాన్), షేన్ వాట్సన్ (రాజస్తాన్), అక్షర్ పటేల్ (పంజాబ్), సామ్యూల్ బద్రీ (బెంగళూరు), ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్), జైదేవ్ ఉనాద్కట్ (పుణే), స్యామ్ కరన్ (పంజాబ్), శ్రేయస్ గోపాల్ (రాజస్తాన్) ఒక్కోసారి హ్యాట్రిక్ నమోదు చేశారు. Wow. Shreyas Gopal with the Kohli-ABD double-double in 2019. #IPL2019 — Vinayakk (@vinayakkm) April 30, 2019 -
గౌతం అద్భుతంగా ఆడాడు : రహానే
జైపూర్ : ఐపీఎల్ సీజన్-12లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో రహానే సేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్.. పాయింట్ల ఖాతా తెరిచింది. అద్భుత బౌలింగ్‌తో మూడు కీలక వికెట్లు తీసిన శ్రేయస్ గోపాల్ దెబ్బకు బెంగళూరు ముందే చేతులెత్తేయగా... బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శనతో రహానే బృందం మ్యాచ్ గెలుచుకుంది. టాస్ నెగ్గిన రాజస్తాన్ సారథి రహానే ఫీల్డింగ్‌కు మొగ్గుచూపి.. బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో పార్థివ్ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఓ సాధారణ స్కోరుకే పరిమితం కాగా.. పార్థివ్ మాత్రం ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాజస్తాన్ బౌలర్లు శ్రేయస్ గోపాల్, క్రిష్ణప్ప గౌతం స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఇక కెప్టెన్ రహానే(22), జోస్ బట్లర్(59) అద్భుత ఓపెనింగ్‌తో జట్టు విజయానికి బాటలు పరిచారు. చదవండి : (ఆర్సీబీపై రాజస్తాన్ ఘన విజయం) ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రాజస్తాన్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘ అవును.. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉంది. పాయింట్ల ఖాతా తెరచి పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకున్నాం. పవర్ ప్లేలో గౌతం చాలా అద్భుతంగా బౌల్ చేశాడు. ఆ తర్వాత కోహ్లి, డివిల్లియర్స్ వికెట్లు తీసి శ్రేయస్ గోపాల్ ఓ రకంగా రికార్డు సృష్టించాడని చెప్పుకోవాలి. గత మూడు మ్యాచుల్లోనూ బాగానే ఆడాం కానీ ఇప్పుడు 100 శాతం ఫలితం సాధించాం. ఇక త్రిపాఠి ఈ మ్యాచ్‌కు ముందు కాస్త తడబడ్డాడు. కానీ స్టోక్సీ, స్మిత్‌లతో కలిసి రాణించాడు. జట్టు సమిష్టి కృషి వల్లే విజయం సాధించాం అని హర్షం వ్యక్తం చేశాడు. -
‘అదృష్టవంతుడిని.. అస్సలు మర్చిపోలేను’
‘ ఆ క్షణం లక్కీగా ఫీలయ్యా. కోహ్లి, ఏబీ వరల్డ్ క్లాస్ ఆటగాళ్లన్న విషయం అందరికీ తెలిసిందే. నాలాంటి యువ ఆటగాళ్లకు అలాంటి లెజెండ్ల వికెట్లు తీసిన సందర్భం చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. నా ప్రయాణంలో ఇది చాలా ప్రత్యేకమైన విజయం’ అంటూ రాజస్తాన్ రాయల్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోహ్లి సేనపై గెలుపొంది.. రాజస్తాన్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. సవాయ్ సింగ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు కీలక ఆటగాళ్లు కెప్టెన్ కోహ్లి, ఏబీ డివిల్లియర్స్‌లను పెవిలియన్‌కు చేర్చిన లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్(3/12) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు.(చదవండి : గోవిందా... గోపాలా!) ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ గోపాల్ మాట్లాడుతూ.. ‘ఈనాటి మ్యాచ్‌లో గూగ్లీలు సంధించి సాహసం చేశానని అనుకుంటున్నా. స్టంప్ టు స్టంప్ బౌల్ చేసి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడానికి ప్రయత్నించా. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో రాణించిన అనుభవం నాలో విశ్వాసాన్ని నింపింది. అక్కడి కంటే కూడా ఐపీఎల్‌లోనే బాగా ఆడుతున్నానని భావిస్తున్నా. నాలాంటి రిస్ట్ స్పిన్నర్లు బంతిని రెండు వైపులా స్పిన్ చేయగలరు. బహుశా అదే ఈ మ్యాచ్‌లో నాకు అడ్వాంటేజ్ అయ్యిందేమో.కోహ్లి, ఏబీ వికెట్లు తీయడం నా క్రీడా ప్రయాణంలో మర్చిపోలేని రోజు’ అని పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో.. ఈ కర్ణాటక లెగ్‌స్పిన్నర్ తన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 7)తోనే బెంగళూరు భరతం పట్టేశాడు. ఓవర్‌కు ఒకరిని చొప్పున మూడు కీలక వికెట్లను కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన టెక్నిక్‌తో ముందుగా కోహ్లిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే డివిలియర్స్ క్రీజులోకి రాగానే 2 పరుగులు ఆ తర్వాత ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు. ఇక బెంగళూరు జోరు మొదలైందనుకునేలోపే గోపాల్ చావుదెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో డివిలియర్స్ (13; 2 ఫోర్లు)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. తర్వాత 11వ ఓవర్ తొలి బంతికే హెట్‌మైర్ (1)ను ఔట్ చేసి.. రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.(చదవండి : కూర్చుని మాట్లాడుకుంటాం : కోహ్లి)