IPL 2021 Viral Video: Rajasthan Royals Player Riyan Parag Imitates Virender Sehwag - Sakshi
Sakshi News home page

'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే' 

Published Sat, May 1 2021 3:51 PM | Last Updated on Sat, May 1 2021 6:24 PM

IPL 2021: Riyan Parag Perfectly Imitates Virender Sehwag Became Viral - Sakshi

courtesy : IPL/RR

ఢిల్లీ: రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఈ సీజన్‌లో ఎలా ఆడుతున్నాడనేది పక్కనపెడితే  మంచి ఎంటర్‌టైన్‌ అందిస్తున్న ఆటగాళ్లలో ఒకడు. మొన్న బిహూ డ్యాన్స్‌తో అలరించిన పరాగ్‌.. నిన్న రాహుల్‌ తెవాటియాతో కలిసి మైదానంలోనే సెల్ఫీ సెలబ్రేషన్‌ అంటూ రచ్చ రచ్చ చేశాడు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను .. అతని హావభావాలతో అనుకరించాడు.

విషయంలోకి వెళితే.. పరాగ్‌ తన సహచరుడైన శ్రేయాస్‌ గోపాల్‌తో కలిసి గెస్సింగ్‌ గేమ్‌ ఆడాడు. పరాగ్‌ యాక్ట్‌ చేసి చూపిస్తుంటే.. గోపాల్‌ వారి పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఈలోగా సెహ్వాగ్‌ వంతు వచ్చింది. పరాగ్‌ సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ ఆటకు సిద్ధమవుతున్నట్లుగా యాక్టింగ్‌ చేశాడు. శ్రేయాస్‌ గోపాల్‌ ఎంత ప్రయత్నించినా సెహ్వాగ్‌ పేరు చెప్పలేకపోయాడు. దీంతో పరాగ్‌ మరో అడుగు ముందుకేసి సెహ్వాగ్‌ ట్రేడ్‌మార్క్‌ షాట్‌ స్క్వేర్‌కట్‌ను చూపించాడు. ఈసారి మాత్రం గోపాల్‌ కరెక్ట్‌గా చెప్పాడు.

దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''కైసా లగా..'' అంటూ వీరు పేరును ట్యాగ్‌ చేసి క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ''పరాగ్‌ జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే'' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేశారు. కాగా పరాగ్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనను నమోదు చేయలేదు. ఆరు మ్యాచ్‌లాడి 63 పరుగులు మాత్రమే చేసిన అతను బౌలింగ్‌లోనూ ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటతీరు పడుతూ లేస్తు అన్నట్లుగా తయారైంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడి 2 విజయాలు.. నాలుగు ఓటములతో ఏడో స్థానంలో నిలిచింది. రాజస్తాన్‌ రాయల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌లో మే2న ఎస్‌ఆర్‌హెచ్‌ను ఎదుర్కోనుంది.
చదవండి: పూరన్‌ చెత్త రికార్డు.. ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement