
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో బుల్లితెర నటుడు నాగమణికంఠ అడుగుపెట్టాడు.

చిన్నప్పటినుంచే ఎన్నో కష్టాలు పడ్డానని, తల్లిదండ్రులను కోల్పోయానని మొదటి రోజే బోరున ఏడ్చాడు.

ఆఖరికి భార్యతో కూడా గొడవలవడంతో తనకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

అందరిముందు ఇలా చెప్పాడే కానీ భార్యతో విడిపోలేదు. కేవలం సంపాదించడానికి భార్య, కూతుర్ని వదిలేసి ఇండియాకు వచ్చాడు.

ఆమెపై అతడి ప్రేమ అలాగే ఉంది. ఈ క్రమంలో నాగమణికంఠ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






