హిందీ బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టంట్లు జస్లీన్ మాథారు, అనుప్ జలోటా ఫోటోలు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. వారి ఫోటోలు నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటోలపై చాలా మంది అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోలు ఎందుకు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటే ఈ ఫోటోలో వీరిద్దరు వివాహవస్త్రాలలో కనిపించారు. ఈ ఫోటోలను జస్లీన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు దేనికి సంబంధించినవో జస్లీన్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు వారికి తోచినట్లు వారు ఊహించుకోవడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోటోలు జస్లీన్, అనుప్ కలిసి నటిస్తున్న 'వోహ్ మేరీ స్టూడెంట్ హై' పేరుతో తెరకెక్కబోతున్న చిత్రంలోనివి అని తరువాత తెలిసింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వీరిపై అనేక పుకార్లు వచ్చాయి. వీరు డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే వారు వీటిని ఖండించారు. అనుప్ జలోటా భజన పాటలు పాడటంలో ప్రసిద్ధి. అయితే ఈ ఫోటోలపై భజన్ సామ్రాట్ అనుప్ స్పందించారు. అవి సినిమా కోసం దిగిన ఫోటోలు అని స్పష్టతనిచ్చారు. ఇక జస్లీన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అస్సలు కాదని ఆమె వస్త్రధారణ సంప్రదాయ బంధమైన తన కుటుంబానికి సరిపోదని తేల్చి చెప్పారు. తాను జస్లీన్ స్టైల్‌ను తప్పుబట్టడం లేదని కానీ థోతి కట్టుకొని దేవుడి భజనలు చేసే తమ ఇంట్లో ఆమె సరిపోదని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకులకు ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసిన వారందరూ తనకు శుభాకాంక్షలు చెబుతున్నారని తాను కూడా వారికి తిరిగి శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. చదవండి: నాగార్జున చెప్పింది నచ్చలేదు: స‌్వాతి
బిగ్‌బాస్ జంట ఫోటోలు మళ్లీ వైరల్!
Published Mon, Oct 12 2020 8:38 AM | Last Updated on Mon, Oct 12 2020 8:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment