Anup jalota
-
బిగ్‌బాస్ జంట ఫోటోలు మళ్లీ వైరల్!
హిందీ బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టంట్లు జస్లీన్ మాథారు, అనుప్ జలోటా ఫోటోలు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. వారి ఫోటోలు నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటోలపై చాలా మంది అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోలు ఎందుకు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటే ఈ ఫోటోలో వీరిద్దరు వివాహవస్త్రాలలో కనిపించారు. ఈ ఫోటోలను జస్లీన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు దేనికి సంబంధించినవో జస్లీన్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు వారికి తోచినట్లు వారు ఊహించుకోవడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోటోలు జస్లీన్, అనుప్ కలిసి నటిస్తున్న 'వోహ్ మేరీ స్టూడెంట్ హై' పేరుతో తెరకెక్కబోతున్న చిత్రంలోనివి అని తరువాత తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వీరిపై అనేక పుకార్లు వచ్చాయి. వీరు డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే వారు వీటిని ఖండించారు. అనుప్ జలోటా భజన పాటలు పాడటంలో ప్రసిద్ధి. అయితే ఈ ఫోటోలపై భజన్ సామ్రాట్ అనుప్ స్పందించారు. అవి సినిమా కోసం దిగిన ఫోటోలు అని స్పష్టతనిచ్చారు. ఇక జస్లీన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అస్సలు కాదని ఆమె వస్త్రధారణ సంప్రదాయ బంధమైన తన కుటుంబానికి సరిపోదని తేల్చి చెప్పారు. తాను జస్లీన్ స్టైల్‌ను తప్పుబట్టడం లేదని కానీ థోతి కట్టుకొని దేవుడి భజనలు చేసే తమ ఇంట్లో ఆమె సరిపోదని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకులకు ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూసిన వారందరూ తనకు శుభాకాంక్షలు చెబుతున్నారని తాను కూడా వారికి తిరిగి శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. చదవండి: నాగార్జున చెప్పింది నచ్చలేదు: స్వాతి -
కూతురు లాంటిది.. తనతో పెళ్లేంటి?!
గజల్ సింగర్, భజన్ మాస్ట్రో అనూప్ జలోటా, బిగ్‌బాస్ ఫేమ్ జస్లీన్ మథారు ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నుదుటిన సింధూరం, చేతులకు గాజులు ధరించి ఓ పాటకు అభినయిస్తూ జస్లీన్ ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు అనూప్, జస్లీన్లు పెళ్లి చేసుకున్నారని.. లాక్డౌన్లో ఇదెలా సాధ్యమైందంటూ అంటూ ట్రోల్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనూప్ జలోటా.. పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. జస్లీన్ తనకు కూతురి వంటిదని.. ఆమె కోసం తాను వరుడిని అన్వేషిస్తున్నట్లు తెలిపారు.(ఫోన్ కొట్టేశారు: హీరోయిన్) ‘‘ఇంకోసారి! జస్లీన్‌తో నా పెళ్లి జరిగినట్లు వార్తలు. నిజం చెప్పాలంటే జస్లీన్ కోసం ఆమె తండ్రితో కలిసి నేను వరుడి వేట మొదలుపెట్టాను. కెనడాలో నివసిస్తున్న ఓ పంజాబీ యువకుడి గురించి వారికి వివరాలు అందజేశాను. అయితే ఇంతవరకు మ్యాచ్ ఫిక్స్ కాలేదు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్లీన్‌ను నేనే కన్యాదానం చేస్తానని చెప్పాను కదా. ఆ మాట నిలబెట్టుకుంటా. తను నా శిష్యురాలు. ఇంకా చెప్పాలంటే కూతురి వంటిది ’’ అని ఓ వెబ్‌సైట్‌తో అనూప్ పేర్కొన్నాడు. కాగా హిందీ బిగ్‌బాస్ 12 సీజన్.. ‘విచిత్ర జోడీస్’ థీమ్‌లో భాగంగా అధ్యాత్మిక గీతాలు, భజనలతో ప్రసిద్ధి చెందిన అనూప్ జలోటా తన శిష్యురాలు జస్లీన్ మథారుతో కలిసి హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.(తండ్రి పాత్రలో నటించడానికి రెడీ: కరణ్) వయసులో దాదాపు 35 ఏళ్ల వ్యత్యాసం గల వీరిద్దరు తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదంతా ప్రాంక్ అని కొట్టిపారేశారు. తమ మధ్య కేవలం గురుశిష్యుల బంధం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి గురించి పలు కథనాలు వెలువడటంతో.. ‘ఓ మేరీ స్టూడెంట్ హై' అనే పేరుతో సినిమాను రూపొందించారు. ఇక ఈ చిత్రానికి జస్లీన్ తండ్రి కేసర్ దర్శకత్వం వహించడం గమనార్హం. View this post on Instagram Chupke se ❤️🤫🤫 A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu) on Apr 28, 2020 at 6:54am PDT -
28 ఏళ్ల జస్లీన్, 65 ఏళ్ల జలోటా మధ్య ఏముంది?
గజల్ సింగర్, భజన్ మాస్ట్రో అనూప్ జలోటా, బిగ్‌బాస్ ఫేమ్ జస్లీన్ మాథారులు ప్రేమించుకున్నట్లు తెలిపి గతంలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల జస్లీన్ మాథారు, 65 ఏళ్ల అనుప్ జలోటా జంటగా గతేడాది హిందీ బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. బిగ్‌బాస్-12వ సీజన్లో అడుగుపెట్టిన వీరిద్దరూ.. తాము మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాక వీరి కోసం ప్రత్యేకంగా బిగ్‌బాస్ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే జస్లీన్ ఎలిమినేట్ అయిన తర్వాత ఇది అంతా ప్రాంక్ అని కొట్టిపారేసింది. అయితే, హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం వీరిద్దరూ తమకేమి సంబంధం లేనట్లు ప్రవర్తించారు. .@anupjalota ko emotionally jhatka laga hai #JasleenMatharu ke wajah se! #BB12 #BiggBoss12 pic.twitter.com/tYO76unUhS — COLORS (@ColorsTV) October 2, 2018 తమపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వీరిద్దరికి సంబంధించిన కథతో ఓ సినిమా నిర్మించారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో 'ఓ మేరీ స్టూడెంట్ హై' అనే చిత్రం తెరకెక్కింది. జస్లీన్ తండ్రి కేసర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గురు, శిష్యులుగా వీరిరువురూ తెరమీద కనిపించనున్నారు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం చాలామందికి ఉన్న అపోహలను తొలగిస్తోంది అని అనూప్ ఓ ఇంటర్యూలో తెలిపారు. గతేడాది దీపావళి కంటే ముందుగానే బిగ్‌బాస్‌లో పాల్గొని అలజడి సృష్టించానని ఆయన ఈ సందర్భంగా ఆయన గర్తుచేశారు. చిత్ర విషయానికొస్తే.. 'ఈ చిత్రంలో జస్లీన్ సంగీతం నేర్చుకోవడానికి తన దగ్గరకు వస్తుందనీ అన్నారు. తాను సాంప్రదాయ సంగీత నేపథ్యం నుంచి రావడంతో.. తనను ఇబ్బంది పెట్టేలా కాకుండా.. నిండుగా ఉన్న దుస్తులు ధరించమని విసిగించే పాత్రలో కనిపిస్తానని' అని చెప్పుకొచ్చారు. -
అవకాశం వస్తే..తెలుగులో పాడుతా..
భజన్ బాద్షా అనగానే ప్రతి సంగీత ప్రియుడికి గుర్తొచ్చే పేరు అనూప్ జలోటా! హార్మోనియం వాయిస్తూ.. చిరుదరహాసంతో మనసులోని సంగీతాన్ని పెదవులమీద ఆడిస్తూ.. మధ్యమధ్యలో ఛలోక్తులు విసురుతూ తనదైన శైలిలో పాటల ప్రేమికులను ఆకట్టుకుంటారు.‘హైడోరైట్’ నిర్వహిస్తున్న ‘హండ్రెడ్ డే హైడోరైట్ సీజన్ 3 ఫెస్టివల్’కి ఈ శనివారం అతిథిగావిచ్చేశారు పద్మశ్రీ అనూప్ జలోటా. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ఆయన జరిపిన మాటామంతీ.. హైదరాబాద్ ఆడియన్స్ భజన్స్ను ఎంత ఇష్టపడతారో.. గజల్స్నీ అంతే ప్రేమిస్తారు. ఉర్దూ, హిందీ భాషలనెంతగా అభిమానిస్తారో.. సంగీతాన్ని అంతే ఇదిగా ఆరాధిస్తారు. తరాలు మారినా ఈ అభిరుచి మాత్రం మారలేదు. ఇక్కడి తెహజీబ్, కల్చర్ దేశంలో ఇంకెక్కడా కనిపించదు. మాలాంటి కళాకారులను ఇన్స్పైర్ చేసేది ఇలాంటి కళాకారులే! సంగీతానుబంధం.. హైదరాబాద్‌తో నాది సంగీతానుబంధం. నా ఆత్మీయ స్నేహితుడు తలత్అజీజ్ (సానియామీర్జా మేనమామ)ది హైదరాబాదే, నా గురువు సమానులు విఠలరావుదీ హైదరాబాదే, నా శిష్యులు శరత్గుప్తా, మంజ్రేకర్లదీ హైదరాబాదే. ఇక్కడ రవీంద్రభారతీ, చౌమొహల్లా ప్యాలెస్ వంటి ఎన్నో అద్భుతమైన కచేరీవేదికలున్నాయి. నేనిక్కడ యాభై కచేరీలు ఇచ్చుంటాను. నేనిక్కడికి ఎప్పుడు వచ్చినా నా పాట వినడానికి విఠల్‌రావు లాంటి సీనియర్స్ వస్తారు. ఐదారేళ్ల కిందట హైదరాబాద్‌లో పండిత్ మోతీరాం జ్ఞాపకార్థం ఓ సంగీత కార్యక్రమం జరిగింది. దాంట్లో నేనూ పాల్గొన్నాను. పండిట్ జస్రాజ్ వచ్చారు. ‘ కేవట్ కభీ కభీ భగవాన్కోభీ..’భజన్ పాడుతుంటే పండిట్ జస్రాజ్ ఏడ్చేశారు. వెంటనే వేదికమీదకు వచ్చి తన మెడలో ఉన్న మంచిముత్యాల హారం తీసి నా మెడలో వేసేశారు. ఆ హారం అతనికి ఓ రాజుగారు ఇచ్చిన కానుకట. ఇంతటి సత్కారాన్ని నాకందించింది హైదరాబాదే. నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం. ఇప్పటిదాకా హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ మొదలు మలయాళీ వంటి తొమ్మిది భాషల్లో పాడాను. తెలుగుభాష ఎంతో తీయనైంది. తెలుగులోనూ మంచి గజల్స్, భజన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో చిన్న అవకాశం వచ్చినా తెలుగులో పాడతాను. దిల్సే.. మా నాన్న (పురుషోత్తమ్‌దాస్ జలోటా) మంచి సంగీతవిద్వాంసుడు. నాకు శాస్త్రీయసంగీతం, భజన్స్ నేర్పింది ఆయనే. ఇక సినిమా మ్యూజిక్కు వస్తే.. సినీ సంగీతానిది అల్పాయుష్షు. ఇది కేవలం బీట్తో పరిచయమవుతున్నదే తప్ప సాహిత్యంతో కాదు. సాహిత్యంతో అలరారే సంగీతమే చిరాయువును నింపుకుంటుంది. నేనెప్పుడు అలాంటి పాటల కోసమే ఆరాటపడుతుంటాను. నేనే కాదు తలత్ అజీజ్, పంకజ్ ఉదాస్, జగజిత్ సింగ్.. మా అందరికీ సాహిత్యమే ముఖ్యం. నా కెరీర్ తొలినాళ్లలో పాడిన ‘ఐసీ లాగీ లగన్’ భజన్ ఇప్పటికీ అంతే పాపులర్. కారణం సాహిత్యం. అందుకే మా తరంలో చాలామంది సంగీతకారులు సినిమాల్లో పాడినా నేను అటువైపు వెళ్లలేదు. భజన్స్, గజల్స్ పాడేటప్పుడు నాటకీయత, డ్రామాకు తావుండదు. గొంతునుంచి కాక హృదయం నుంచి వస్తుంది. దిల్ సే.. వస్తుంది. ఏ కళ అయినా ఒక యోగం. అందులో భారతీయ సంగీతం మహాద్భుతమైనది. మనసును ఉల్లాసపరచడమే కాదు ఏకాగ్రతనూ పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతనకు ఇదీ ఓ సాధనం. ఇలాంటి కళల సాధనకు షార్ట్‌కట్స్ ఉండవు. నెవర్ ట్రై ఫర్ షార్ట్ కట్స్. అవి షార్ట్‌సర్క్యూట్స్. అభ్యాసన అనే పొడవైన దారి ఒకటే ఉంటుంది. ఆ దారి ఎన్నో విషయాలను నేర్పుతుంది. ..:: శరాది