గజల్ సింగర్, భజన్ మాస్ట్రో అనూప్ జలోటా, బిగ్‌బాస్ ఫేమ్ జస్లీన్ మథారు ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నుదుటిన సింధూరం, చేతులకు గాజులు ధరించి ఓ పాటకు అభినయిస్తూ జస్లీన్ ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు అనూప్, జస్లీన్‌లు పెళ్లి చేసుకున్నారని.. లాక్‌డౌన్‌లో ఇదెలా సాధ్యమైందంటూ అంటూ ట్రోల్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనూప్ జలోటా.. పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. జస్లీన్ తనకు కూతురి వంటిదని.. ఆమె కోసం తాను వరుడిని అన్వేషిస్తున్నట్లు తెలిపారు.(ఫోన్ కొట్టేశారు: హీరోయిన్)
‘‘ఇంకోసారి! జస్లీన్‌తో నా పెళ్లి జరిగినట్లు వార్తలు. నిజం చెప్పాలంటే జస్లీన్ కోసం ఆమె తండ్రితో కలిసి నేను వరుడి వేట మొదలుపెట్టాను. కెనడాలో నివసిస్తున్న ఓ పంజాబీ యువకుడి గురించి వారికి వివరాలు అందజేశాను. అయితే ఇంతవరకు మ్యాచ్ ఫిక్స్ కాలేదు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్లీన్‌ను నేనే కన్యాదానం చేస్తానని చెప్పాను కదా. ఆ మాట నిలబెట్టుకుంటా. తను నా శిష్యురాలు. ఇంకా చెప్పాలంటే కూతురి వంటిది ’’ అని ఓ వెబ్‌సైట్‌తో అనూప్ పేర్కొన్నాడు. కాగా హిందీ బిగ్‌బాస్ 12 సీజన్.. ‘విచిత్ర జోడీస్’ థీమ్‌లో భాగంగా అధ్యాత్మిక గీతాలు, భజనలతో ప్రసిద్ధి చెందిన అనూప్ జలోటా తన శిష్యురాలు జస్లీన్ మథారుతో కలిసి హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.(తండ్రి పాత్రలో నటించడానికి రెడీ: కరణ్)
వయసులో దాదాపు 35 ఏళ్ల వ్యత్యాసం గల వీరిద్దరు తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదంతా ప్రాంక్ అని కొట్టిపారేశారు. తమ మధ్య కేవలం గురుశిష్యుల బంధం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి గురించి పలు కథనాలు వెలువడటంతో.. ‘ఓ మేరీ స్టూడెంట్ హై' అనే పేరుతో సినిమాను రూపొందించారు. ఇక ఈ చిత్రానికి జస్లీన్ తండ్రి కేసర్ దర్శకత్వం వహించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment