భార్యతో ఏడడుగులు నడిచిన హార్దిక్ పాండ్యా (PC: Hardik Pandya Instagram)
Hardik Pandya- Natasa Stankovic Hindu Wedding New Images: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ దంపతులు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. మూడేళ్ల క్రితం అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ ప్రేమజంట.. ఈ వాలంటైన్స్ డేన రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో హార్దిక్- నటాషా పెళ్లి కన్నులపండువగా జరిగింది. తమ కుమారుడు అగస్త్యతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత భార్య విశ్వాసాలకు అనుగుణంగా ‘వైట్ థీమ్ వెడ్డింగ్’ ఏర్పాటు చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను వివాహమాడాడు.
క్రిస్టియన్ వివాహ పద్ధతిలో నటాషా పొడవాటి అందమైన తెల్లటి గౌన్ ధరించగా.. రెండో పద్ధతిలో బంగారు- ఎరుపు వర్ణాలు కలగలసిన లెహాంగాలో మెరిసిపోయింది. ఇక పెళ్లికి ఎరుపు రంగు చీరకట్టుకుని అందమైన ఆభరణాలు ధరించి అచ్చమైన భారతీయ వనితలా కనిపించింది.
PC: Hardik Pandya Instagram
తొలుత ఉంగరాలు మార్చుకుని మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివిన ఈ జంట.. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచి ముచ్చటగా మూడోసారి పెళ్లాడారు. హార్దిక్ పాండ్యా తన భార్య నుదుటిన సింధూరం దిద్ది మురిసిపోయాడు.
PC: Hardik Pandya Instagram
ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు హార్దిక్- నటాషా దంపతులు. ‘‘ఇప్పుడు.. ఎల్లప్పుడూ’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో తమ ప్రేమబంధం శాశ్వతం అంటూ క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
PC: Hardik Pandya Instagram
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కాగా గుజరాత్‌కు చెందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు.. సెర్బియా మోడల్, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నటాషా గర్భం దాల్చిన తర్వాత అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు.
PC: Hardik Pandya Instagram
వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. త్వరలోనే పూర్తిస్థాయిలో భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్‌లో అతడు గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..!
IND Vs AUS 2nd Test Prediction: సూర్య స్థానంలో అయ్యర్.. గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు
Comments
Please login to add a commentAdd a comment