Actress Shivaleeka Oberoi And Director Abhishek Pathak Wedding Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Shivaleeka Oberoi Marriage: డైరెక్టర్‌ను పెళ్లాడిన హీరోయిన్.. పోస్ట్‌ వైరల్‌

Published Fri, Feb 10 2023 2:44 PM | Last Updated on Fri, Feb 10 2023 3:17 PM

Actress Shivaleeka Oberoi and Drishyam 2 director Abhishek Pathak wedding photos - Sakshi

బాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి- కేఎల్ రాహుల్, కియారా-సిద్దార్థ్ జంటలు ఒక్కటవ్వగా.. తాజాగా మరో ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్‌ అభిషేక్‌ పాఠక్‌, కుదా హఫీజ్‌ హీరోయిన్‌ శివలీకా ఒబెరాయ్‌ పెళ్లి గురువారం అత్యంత వైభవంగా జరిగింది. గోవాలో జరిగిన వెడ్డింగ్‌కు స్నేహితులు, బంధుమిత్రులు హాజరయ్యారు. కాగా.. గతంలోనే టర్కీలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది బాలీవుడ్ జంట.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శివాలికా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. 

(ఇది చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్‌ పెళ్లి.. పోస్ట్‌ వైరల్‌)

శివాలికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీరు ప్రేమను కనిపెట్టలేదు. ప్రేమే మిమ్మల్ని కనిపెట్టినట్లుంది. మా ఇద్దరి బంధం ఆకాశంలో నక్షత్రాల మధ్య నిర్ణయించినట్లుంది. నా జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేను. మా ప్రియమైన వారితో వివాహబంధంలోకి అడుగుపెట్టాం. ఇది మా జీవితంలో అత్యంత అద్భుత క్షణం. మా హృదయాలు ప్రేమ, జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం.' అని అన్నారు. 

పెళ్లి గోవాలో 2 రోజుల పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్‌, అమన్ దేవగన్, కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భరుచ్చా, విద్యుత్ జమ్వాల్, సన్నీ సింగ్, భూషణ్ కుమార్, దర్శకుడు లవ్ రంజన్, ఇషితా రాజ్ శర్మ హాజరయ్యారు. కాగా శివలీకా ఒబెరాయ్‌ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్‌ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్‌ పాఠక్‌ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది.ఇటీవలే 'దృశ్యం 2'తో  అభిషేక్ పాఠక్ సూపర్ హిట్ సాధించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement