గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేఎల్‌ రాహుల్‌ | KL Rahul, Athiya Shetty Announce Pregnancy | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేఎల్‌ రాహుల్‌

Published Fri, Nov 8 2024 6:17 PM | Last Updated on Fri, Nov 8 2024 6:33 PM

KL Rahul, Athiya Shetty Announce Pregnancy

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్‌, అతని భార్య అతియా శెట్టి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. మా అందమైన ఆశీర్వాదం 2025లో రాబోతుందని రాహుల్‌, అతియా జంట తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాహుల్‌, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. 

వీరికి బాలీవుడ్‌ మరియు క్రికెట్‌ సర్కిల్స్‌లో అందమైన, అన్యూన్యమైన జంటగా పేరుంది. రాహుల్‌ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్‌ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.

కాగా, ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. రాహుల్‌.. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌-ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. రాహుల్‌ ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు చేస్తూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రాహుల్‌ భారత టెస్ట్‌ జట్టులో చోటు కోల్పోయాడు. 

రాహుల్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ  మ్యాచ్‌లో రాహుల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు, పది పరుగులు చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్‌కు ఆట పరంగా ఏదీ కలిసి రావడం లేదు. రాహుల్‌ను తన ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా వేలానికి వదిలేసింది. 

ఇదిలా ఉంటే, భారత టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది. రోహిత్‌ భార్య రితక డెలివరీకి సిద్దంగా ఉండటంతోనే రోహిత్‌ ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌కు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement