Suniel Shetty Says He Is Scared To Talk, Says People In Social Media Abusing My Family - Sakshi
Sakshi News home page

Suniel Shetty: వాటితో సెలబ్రిటీల జీవితాలు నాశనం: సునీల్ శెట్టి సంచలన కామెంట్స్

Published Mon, Apr 24 2023 3:13 PM | Last Updated on Mon, Apr 24 2023 3:37 PM

Suniel Shetty is afraid of social media Because people call my daughter - Sakshi

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేదు. 1992 నుంచి  సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్, పరేష్ రావల్‌తో కలిసి హేరా ఫేరి- 3లో నటిస్తున్నారు. తాజాగా ది రణవీర్ షోకు హాజరైన ఆయన సోషల్ మీడియాపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌లో కొంతమంది తన కుటుంబం గురించి చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని తెలిపారు. 

నటీనటులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని సునీల్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలంలో వ్యక్తిగత గోప్యత లేదని ఆయన అన్నారు. సెలబ్రిటీల జీవితాలను నాశనం చేస్తున్న సోషల్ మీడియాలో ఉండటం అసాధ్యమని సునీల్ శెట్టి వెల్లడించారు. 

సునీల్ శెట్టి మాట్లాడుతూ..' నాకు సోషల్ మీడియా అంటే భయం. అందుకే మాట్లాడటానికి భయపడుతున్నా. సోషల్ మీడియాలో నా కుమార్తె, తల్లిపై అసభ్యంగా కామెంట్స్ చేశారు. అలాంటి ట్రోల్స్‌తో చాలా బాధపడ్డా. ఇలాంటి చర్యలు దేనికి దారితీస్తాయో కూడా వారికి తెలియదు. తెర వెనుక ఉన్న వ్యక్తులు నా కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడటం బాధ కలిగించింది. ఇలాంటి వాటిపై తాను నిశ్శబ్దంగా ఉండనని' ‍అని తేల్చి చెప్పారు.  

కాగా.. సునీల్ శెట్టి గారాల కూతురు అతియా శెట్టికి క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌తో ఈ ఏడాది వివాహామైన సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి చివరిసారిగా అమెజాన్ మిని టీవీ  కొత్త వెబ్ సిరీస్ హంటర్‌లో కనిపించాడు. ధారవి బ్యాంక్‌తో తర్వాత రెండోసారి వెబ్ సిరీస్‌లో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement