PC: INSIDE Sport
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ శకం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయనంతరం పొట్టి క్రికెట్‌కు రోహిత్ శర్మ విడ్కోలు పలికాడు. ఎన్నో ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించి రోహిత్ తన టీ20 కెరీర్‌ను ముగించాడు.
140 కోట్ల భారతీయల కలను సారథిగా రోహిత్ సాకారం చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ను ఉద్దేశించి తన భార్య రితికా సజ్దేహ్ భావోద్వేగ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రితికా తెలిపింది.
"రో.. ఈ విజయం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ క్షణం కోసం నీవు ఎంతగానో ఎదురుచూశావు. ఈ ఫార్మాట్, ఈ కప్, ఈ ఆటగాళ్లు, ఈ ప్రయాణం.. మొత్తం ఈ పక్రియ అంతా నీవు కన్న కల. నీవు గత కొన్ని నెలలగా ఎటువంటి క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నావో నాకు తెలుసు.
అది నీ మనసు, శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. ఎట్టకేలకు నీ కల నేరివేరింనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఈ ప్రయాణం ఎంతో స్పూర్తిదాయకం. ఓ భార్యగా ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
కానీ నీ ఆటను ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఇప్పడు టీ20లకు విడ్కోలు పలకడం చాలా బాధగా ఉంది. ఇది నీకు కఠిన నిర్ణయమైనా.. జట్టుకు ఏది ఉత్తమైనదో దాని గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు. కానీ నేను మాత్రం నీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.
ఏదేమైనప్పటకి నీలాంటి గొప్ప వ్యక్తి నా సొంతమైనందకు ఒక భార్యగా నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్ వ్యూ సో మచ్’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం రోహిత్‌తో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా సైతం పొట్టి క్రికెట్‌కు ముగింపు పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment