
రోజులో మనం ఎంత బిజీగా ఉన్నా కట్టుకున్న భార్య నుంచి ఫోన్ వస్తే మాట్లాడడమో లేక వీలు చూసుకుని ఫోన్ చేయడమో చేస్తుంటాం. కామన్‌మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు ఇదే వర్తిస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దీనికి అతీతమేమి కాదు. అయితే భార్య రితికా మిస్‌డ్ కాల్‌కు రోహిత్ స్పందించకపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవలే విండీస్‌తో టి20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ హోదాలో ఫుల్ జోష్‌లో ఉన్న రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఫోటోలతో పాటు ''తర్వాతి టార్గెట్ లంక అని.. నెక్ట్స్ అప్.. బీ రెడీ'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన భార్య రితికా.. రోహిత్‌ను ఉద్దేశించి ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. ''అంతా గ్రేట్‌గా కనిపిస్తుంది.. ప్లీజ్ నాకు ఒకసారి ఫోన్ చేయ్'' అంటూ పేర్కొంది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ రితికా శర్మ మెసేజ్‌కు లైక్‌లు, షేర్స్ కొడుతూ కామెంట్ చేశారు. ''రోహిత్ నీ భార్యను కాస్త పట్టించుకో.. ఎంత కెప్టెన్ అయితే మాత్రం కట్టుకున్న భార్యను మరిచిపోతావా'' అంటూ పేర్కొన్నారు.
ఇక శ్రీలంకతో టీమిండియా మొదట మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది.మొదటి టి20 ఈ నెల 24న లక్నోలో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరుగనున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహలీ వేదికగా తొలి టెస్టు(మార్చి 4 నుంచి 8 వరకు), బెంగళూరు వేదికగా రెండో టెస్టు(మార్చి 12 నుంచి 16 వరకు) జరగనుంది.
చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్
Virat Kohli: ఈ ఫోటోలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎక్కడున్నాడో గుర్తు పట్టండి..!
Comments
Please login to add a commentAdd a comment