
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఈ సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. తొలుత విరాట్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది. అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు విరాట్ మనసు మార్చుకున్నాడని తెలుస్తుంది. తాను అందుబాటులో ఉండే విషయాన్ని కోహ్లి.. బీసీసీఐకి కూడా చెప్పేసినట్లు సమాచారం.
మరోవైపు లంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. తొలుత రోహిత్ కూడా ఈ సిరీస్ ఆడడని ప్రచారం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సిరీస్ కోసం జట్టును ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, శ్రీలంకతో వన్డే సిరీస్ ఆగస్ట్ 2 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత్.. శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment