రితిక బర్త్‌డే.. అందమైన ఫొటోలు షేర్‌ చేసిన రోహిత్‌! ఎంఐపై ట్రోల్స్‌ | Another Excuse To celebrate You: Rohit Sharma Birthday Wish For Ritika | Sakshi
Sakshi News home page

రితిక బర్త్‌డే.. అందమైన ఫొటోలు షేర్‌ చేసిన రోహిత్‌! ఎంఐపై ట్రోల్స్‌

Dec 21 2023 7:33 PM | Updated on Dec 21 2023 8:10 PM

Another Excuse To celebrate You: Rohit Sharma Birthday Wish For Ritika - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సతీమణి రితికా సజ్దేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘‘నీలాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు’’ అన్న అర్థంలో హ్యాపీ బర్త్‌డే రిట్స్‌ అంటూ ప్రేమను చాటుకున్నాడు.

ఈ సందర్భంగా రితికతో కలిసి ఉన్న అందమైన ఫొటోలను రోహిత్‌ శర్మ షేర్‌ చేశాడు. ఈ క్రమంలో రితికకు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ సైతం రిట్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేక్‌ ఎమోజీలు జతచేసింది.

ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘అంత ప్రేమ నటించాల్సిన అవసరం లేదు. మీకు హిట్‌మ్యాన్‌పై గౌరవం ఉంటే అతడిని మళ్లీ కెప్టెన్‌ను చేయండి’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉన్నాడు.

మరోవైపు.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ను ఫ్రాంఛైజీ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మాజీ సారథి హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.  

డిసెంబరులోనే హిట్‌మ్యాన్‌కు మూడు పండుగలు!
డిసెంబరు 13, 2015లో రోహిత్‌- రితికని పెళ్లాడాడు. ముంబైలోని తాజ్‌ ల్యాండ్స్‌ హోటళ్లో వీరి వివాహం వైభవోపేతంగా జరిగింది. ఆ తర్వాత.. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ యజమానులు అంబానీ కుటుంబం రోహిత్‌- రితిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఘనంగా సెలబ్రేట్‌ చేసింది. ఇక డిసెంబరు 21న రితిక పుట్టినరోజు కాగా.. డిసెంబరు 30న రోహిత్‌- రితికల గారాలపట్టి సమైరా బర్త్‌డే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement