మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వివాదస్పదంగా ఔటయ్యాడు. దీంతో మరోసారి డీఆర్‌ఎస్ విధానంపై అనుమానాలు రేకెత్తాయి. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతి రోహిత్ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్ రివ్యూ కోరంగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. స్పష్టత లేనప్పుడు బెన్‌ఫిట్ ఆప్ డౌట్ కింద బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించాలి కానీ అలా జరగలేదు.
ఇక రోహిత్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకంటించడం పట్ల అతడి సతీమణి రితికా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న రితిక గురువారం విండీస్-టీమిండియా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. రోహిత్ ఔట్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయానికి ప్రకటించే సమయంలో అన్ని కెమెరాలు రితిక వైపు తిరిగాయి. రోహిత్‌ను అవుటని ప్రకటించగానే ‘వాట్’అంటూ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక 15 రోజుల పాటు టీమిండియా క్రికెటర్లతో కుటుంబ సభ్యులు ఉండేందుకు బీసీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment