మాంచెస్టర్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రోహిత్ స్పందించాడు. తాను ఔటైన తీరును ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఔట్‌ను జూమ్ చేసి మరీ అభిమానులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే తలపట్టుకున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ‘ ఇప్పుడు చెప్పండి.. ఇది ఔటా’ అని రోహిత్ కోరుతున్నట్లు ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇక్కడ చదవండి: ఇదేం డీఆర్‌ఎస్‌రా నాయనా!)
కీమర్ రోచ్ బౌలింగ్‌లో రోహిత్ ఆడిన బంతి కీపర్ చేతుల్లో పడింది. విండీస్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దీనిపై విండీస్ రివ్యూ కోరింది. రీప్లేలో స్నికోలో కనిపించిన స్పైక్‌ను బట్టి థర్డ్ అంపైర్ మైకేల్ గాఫ్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి బ్యాట్‌కంటే ప్యాడ్‌కు తగిలినప్పుడు స్నికో స్పందించినట్లుగా, బంతికి బ్యాట్‌కు మధ్య కొంత ఖాళీ ఉన్నట్లు కూడా అనిపించింది. దీనిపై పూర్తి స్పష్టత లేకపోయినా అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని భారత్‌కు ప్రతికూలంగా వెల్లడించారు. దాంతో రోహిత్ భారంగా పెవిలియన్ చేరాడు.
అతను పెవిలియన్‌కు చేరే క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు రోహిత్. అదే సమయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు సైతం తప్పుబట్టారు. ఆ ఔట్‌పై క్లియరెన్స్ లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికైనా వదిలేయాలి లేదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వాలి కదా అని మండిపడుతున్నారు. ప్రధానంగా డీఆర్‌ఎస్ ఉన్నది ఇందుకేనా అంటూ విమర్శించారు. ఈ ఔట్‌పై రోహిత్ భార్య రితిక హ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అసహనం వ్యక్తం చేయగా, తాజాగా రోహిత్ తాను థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన సంగతిని జూమ్ చేసి మరీ ట్విటర్‌లో పెట్టాడు.
🤦♂️👀 pic.twitter.com/0RH6VeU6YB
— Rohit Sharma (@ImRo45) 28 June 2019
Comments
Please login to add a commentAdd a comment