
మొహాలి: పెళ్లిరోజున ఎవరైనా ఏం చేస్తారు. ఆఫీసుకు సెలవుపెట్టి రోజంతా కుటుంబంతో సరదా గడుపుతారు. కానీ రోహిత్ శర్మ బరిలోకి దిగి సరికొత్త రికార్డు లిఖించాడు. చావొరేవో తెల్చుకోవాల్సిన మ్యాచ్‌లో జూలు విధిలించాడు. డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. గత మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేశాడు. పెళ్లిరోజున తన ఆటను కళ్లారా చూసేందుకు వచ్చిన భార్యకు అపురూపమైన కానుక ఇచ్చాడు. రోహిత్ మైదానంలో ఆడుతున్నంతసేపు అతడి అర్థాంగి రితికా సజ్దేహ్ ఆసక్తికరంగా ఆటను తిలకించింది. సెంచరీకి చేరువైన వేళ ఆమె కాస్త ఆందోళన పడింది.
తన భర్త సెంచరీ చేయడం ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె ఊపిరి పీల్చుకుంది. రోహిత్ కూడా మైదానం నుంచే తన సతీమణికి గాల్లో ముద్దు విసిరాడు. శతకం బాదిన తర్వాత రోహిత్ సిక్సర్ల మోత ముగించాడు. సిక్స్ కొట్టిన ప్రతిసారి కెమెరామెన్ ఆమె హావభావాలను అభిమానులకు చూపించాడు. డబుల్ సెంచరీ సాధించినప్పడు రోహిత్-రితిక ఆనందం శిఖరాలను తాకింది. రోహిత్ మూడో ద్విశతకంతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో రితిక కళ్లు ఆనంద భాష్పాలు వర్షించాయి. స్టేడియంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. పెళ్లిరోజును మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్న ఈ జంటపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.
RT for Rohit sharma's wife 😁👌
— Assassinator (@Android_boy_17) 13 December 2017
FAV for Rohit Sharma #INDvsSL pic.twitter.com/1xYEPJTn4f
Only Person On The Field With A Better Timing Than Rohit Sharma Is The Cameraman Showing Rohit's Wife After Every SIX. 😁💃🙏🇮🇳#INDvSL #INDvsSL #RohitSharma
— Sir Ravindra Jadeja (@SirJadeja) 13 December 2017
200 up for "Rohit Sharma" that too on his anniversary. He's not a human,from 100 to 200 in just 38 balls. #RohitSharma #INDvSL pic.twitter.com/uBh85W5Y75
— Mahak Mohan (@MahakMohan) 13 December 2017
Relationship Goals😍😍"Rohit Sharma" #RohitSharma #INDvSL pic.twitter.com/vvlCLd12GX
— Varshini Chowdary😎 (@Varshinigaru) 13 December 2017
Rohit Sharma the hitman totally pushed #Virushka trend outside of timeline in a single day and this picture overshadowed everything #RohitSharma208 #INDvsSL pic.twitter.com/w3JAjJRTx3
— Renu Manuja (@RenuManuja) 13 December 2017
పెళ్లిరోజున మరపురాని జ్ఞాపకం
Comments
Please login to add a commentAdd a comment