
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 18 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు.
Photo: IPL Twitter
మంచి టచ్‌లో ఉన్న రోహిత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భాగ్యనగరంలో భర్త ఆటను ఎంజాయ్ చేద్దామని వచ్చిన రితికాకు నిరాశే మిగిలింది. రోహిత్ ఔట్ కాగానే బుంగమూతి పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ritika Sajdeh's reaction on Rohit Sharma dismissal. pic.twitter.com/MmYVkOf5Lr
— CricketGully (@thecricketgully) April 18, 2023