ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ 36, మార్క్రమ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, రిలే మెరిడిత్, జాసన్ బెహండార్ఫ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, కామెరాన్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి దిశగా పయనిస్తోంది. మయాంక్ అగర్వాల్(48), క్లాసెన్(36) వెనువెంటనే ఔట్ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్ 132 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్ సమద్1, మార్కో జాన్సెన్ (0) క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
అభిషేక్ శర్మ(1) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
8 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 64/2
8 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 28, మార్క్రమ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్.. 4 ఓవర్లలో 26/2
4 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మయాంక్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు హ్యారీ బ్రూక్ 9, రాహుల్ త్రిపాఠి ఏడు పరుగులు చేసి బెండార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగారు.
ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ 193..
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ చెరొక వికెట్ తీశారు.
ఫిఫ్టీతో మెరిసిన గ్రీన్.. ముంబై 172/4
ముంబై బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ఫిఫ్టీతో మెరిశాడు. 33 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్థసెంచరీ సాధించాడు. కాగా గ్రీన్‌కు ఇదే తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం ముంబై 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గ్రీన్ 58, టిమ్ డేవిడ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
దంచి కొడుతున్న తిలక్ వర్మ.. 16 ఓవర్లలో 144/3
హోంగ్రౌండ్‌లో తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఉతికారేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిలక్ వర్మ 15 బంతుల్లో 31 బ్యాటింగ్, గ్రీన్ 38 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు.
మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. సూర్య(7) ఔట్
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై మూడో ఇకెట కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. గ్రీన్ 21, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
9 ఓవర్లలో ముంబై 69/1
9 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 25, కామెరాన్ గ్రీన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ నటరాజన్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రోహిత్ శర్మ(28) ఔట్.. తొలి వికెట్ డౌన్
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ నటరాజన్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరెంతంటే?
మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 19, ఇషాన్ కిషన్ 8 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్
ఐపీఎల్ 16వ సీజన్ 25వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఎదురుపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ రెండు జట్లు ఓటములతోనే సీజన్‌ను ప్రారంభించాయి. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఇరుజట్లు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి.
#TheOrangeArmy skipper Aiden Markram elects to field first after winning the toss in Hyderabad 🤩
Watch #SRHvMI -LIVE & FREE with #IPLonJioCinema across all telecom operators 👈#IPL2023 #TATAIPL | @SunRisers @AidzMarkram pic.twitter.com/wW3pe1MV2e
— JioCinema (@JioCinema) April 18, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
ఇక సొంత గ్రౌండ్‌లో ఆడుతుండడం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద బలం అని చెప్చొచ్చు. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన మార్క్రమ్ సేన ముంబై పట్టు పట్టేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాకు షాకిచ్చిన ముంబై అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. దాంతో, ఎవరిది పై చేయి కానుంది అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇరుజట్ల గత రికార్డులు పరిశీలిస్తే 19 మ్యాచ్‌లు జరగ్గా.. పదింటిలో ముంబై నెగ్గగా.. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment