Rohit Sharma Pranks Wife Ritika: టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో సరదాగా గడుపుతాడన్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్.. తన భార్య రితిక సజ్దేను ప్రాంక్ చేసి భయపెట్టిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను రోహిత్ స్వయంగా చిత్రీకరించి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో రోహిత్.. అద్దం ముందు నిల్చోని తన పిడికిలిలో ఓ చాక్లెట్‌ను ఉంచుకుంటాడు. అక్కడి నుంచి మరో రూంలో ఉన్న భార్య రితిక వద్దకు వెళ్తాడు. పిడికిలిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరతాడు.
అందులో ఏదో భయపెట్టే వస్తువు ఉంటుందని భావించిన రితిక.. పిడికిలిని ఓపెన్ చేసేందుకు భయపడింది. రోహిత్ ఎంత అడిగినా రితిక పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. హిట్‌మ్యాన్ సస్పెన్స్‌ను తెరదించుతాడు. అందులో చాక్లెట్‌ను చూసిన రితిక.. తెగ నవ్వుకుంటుంది. ఈ సరదా వీడియోను రోహిత్.. అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2021 కోసం రోహిత్.. ఫ్యామిలీతో కలిసి యూఏఈలో ఉన్నాడు. రోహిత్ సారధ్యంలో ముంబై జట్టు ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే నెగ్గి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. నేడు ముంబై జట్టు కీలకమైన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది.
చదవండి: Sushil Kumar Bail Petetion: క్రూరంగా హింసించి చంపారు.. బెయిల్ ఇవ్వకండి
Comments
Please login to add a commentAdd a comment