రోహిత్‌ భార్యపై ధోని ఫ్యాన్స్‌ ఫైర్‌! | MS Dhoni Fans Slams Rohit Sharma Wife | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 7 2018 7:44 PM | Last Updated on Sat, Apr 7 2018 7:52 PM

MS Dhoni Fans Slams Rohit Sharma Wife - Sakshi

ధోని, రితికా, రోహిత్‌ (ఫైల్‌ ఫొటో)

ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మ్యాచ్‌తో తెరలేవనుంది. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ఈ జట్ల మధ్య పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే ఇరు జట్ల కెప్టెన్లు అయిన మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మ అభిమానుల మధ్య సోషల్‌ మీడియా వేదికగా గొడవ మొదలైంది. 

ఏకంగా రోహిత్‌శర్మ భార్య రితికా సజ్దేను టార్గెట్‌ చేస్తూ ధోని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. దీనికి కారణం రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌. ఈ పోస్ట్‌ ధోని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ఓ మ్యాగజైన్‌పై రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కూల్‌ అని ఉన్న ఫొటో.  అది సంగతి కెప్టెన్‌ కూల్‌ అంటే ధోని ఒక్కడే అర్హుడని ఆయన అభిమానుల వాదన. ఇంకేముంది సోషల్‌ మీడియా వేదికగా రితికాను నిలదీసారు. కొందరు మర్యాద పూర్వకంగా ఆ ట్యాగ్‌ ధోనిది దయచేసి రోహిత్‌కు ఇవ్వద్దని విజ్ఞప్తి చేయగా..మరి కొందరు.. ‘రితికా ఆ ట్యాగ్‌ కోసం అడుక్కోకు!’ అని సెటైర్‌ వేశారు. ప్రపంచంలో కూల్‌ కెప్టెన్‌ అంటే ధోనినే మరేవరు కాదని ఇంకొందరు కామెంట్‌ చేశారు.

అయితే రోహిత్‌ అభిమానులు మాత్రం రోహిత్‌ కూల్‌ కెప్టెనేనని అంగీకరిస్తున్నారు. ముంబైని మూడు సార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లోనే విజయవంతమైన కెప్టెన్‌ అని అతని అభిమానులు ప్రతి వాదనకు దిగారు. రోహిత్‌ కెప్టెన్సీ ప్రశాంతంగా చేస్తాడని కూల్‌ కెప్టెన్సీ విషయంలో తప్పులేదని రోహిత్‌ భార్యకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కామెంట్స్‌పై రితికా సజ్దే మాత్రం స్పందించలేదు.

🔥 🔥 🔥 🔥 @rohitsharma45 @gqindia

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on

అభిమానుల కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement