
సాక్షి, స్పోర్ట్స్ : పెళ్లి రోజున భార్య కంట కన్నీరు పెట్టించి మరీ ట్రిపుల్ ధమాకా అందించిన రోహిత్ శర్మ.. ఆ రికార్డు సాధించి పట్టుమని పది రోజులు కూడా తిరగకముందే లంక బౌలర్లకు మైదానంలో మరోసారి చుక్కలు చూపించాడు. నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ రికార్డును సమం చేసేశాడీ స్టార్ బ్యాట్స్‌మన్.
అయితే మ్యాచ్ ముగిశాక అతని ఖాతా మొత్తం శుభాకాంక్షల సందేశాలతో నిండిపోగా.. రోహిత్ మాత్రం ఆ క్రెడిట్ మొత్తాన్ని తన భార్య ఖాతాలో వేసేశాడు. మై లక్కీ ఛార్మ్ అంటూ భార్య కమ్ మేనేజర్ అయిన రితిక సజ్‌దేతో దిగిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు.
ఇంకేం క్యూట్‌గా ఉన్న ఆ జంటను చూసి చాలా మంది లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. ఇప్పటిదాకా 6లక్షల పైగానే లైకులు, 5 వేలకు పైగా కామెంట్లు వచ్చి చేరాయి. డిసెంబర్ 21న పుట్టిన రోజు జరుపుకున్న రితికకు రోహిత్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆమె పుట్టిన రోజున రితిక లాంటి భార్య దొరకటం తన అదృష్టం అంటూ రోహిత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment