
నేడు రోహిత్-రితికాల పెళ్లి
మరో భారత క్రికెటర్ ఓ ఇంటి కానున్నాడు. తన స్నేహితురాలు రితికా సజ్దేహ్ ను రోహిత్ శర్మ ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నాడు.
ముంబై: మరో భారత క్రికెటర్ ఓ ఇంటివాడు కానున్నాడు. తన స్నేహితురాలు రితికా సజ్దేహ్ ను రోహిత్ శర్మ ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నాడు. గత ఆరేళ్ల రోహిత్- రితికాల స్నేహానికి కొన్ని నెలల క్రితమే పెద్దల అంగీకారం లభించింది. రితిక తన మేనేజర్ గా వ్యవహరించిన కాలంలోనే ఆమె ప్రేమకు రోహిత్ బౌల్డ్ అయ్యాడు. ఈ విషయాన్ని తన కెరీర్‌ను ప్రారంభించిన ముంబై బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌లోనే రోహిత్ ప్రతిపాదించాడు. దీనికి రితిక కూడా ఆమోదం తెలపడంతో వీరి నిశ్చితార్థం ఈ ఏడాది మే నెలలో జరిగింది.
వీరి వివాహ వేడుక ముగిసిన అనంతరం రిసెప్షన్ కార్యక్రమం ఉంటుందని రోహిత్ సన్నిహితులు తెలిపారు. వీరి వివాహానికి ప్రముఖ క్రికెటర్లతో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ఈ వివాహ కార్యక్రమంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువరాజ్ సింగ్-హజిల్ కిచ్ ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోహిత్ వివాహా కార్యక్రమానికి సురేష్ రైనా, ఉమేష్ యాదవ్ , అతని భార్య తాన్యాలు హాజరుకానున్నారు.