
సాక్షి, హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ తొలిమ్యాచ్ నవంబర్16న ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం భారత్‌లో పర్యటించిన లంక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా 0-2తో సీరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో లంకలో పర్యటించిన భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్‌చేసింది. ఇక ఎకైక టీ20లో కూడా విజయం భారత్‌నే వరించింది. అయితే ఈ సిరీస్ అనంతరం లంక మంచి ప్రదర్శనతో పాక్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గింది. దీంతో భారత్‌లో జరిగే మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు రసవత్తరంగా సాగనున్నాయి.
♦ టెస్టు షెడ్యూల్
తొలి టెస్టు: నవంబర్ 16 నుంచి 20 వరకు; వేదిక: ఈడేన్ గార్డెన్స్, కోల్‌కతా
రెండో టెస్టు: నవంబర్ 24 నుంచి 28 వరకు; వేదిక: వీసీఏ స్టేడియం, జమ్తా, నాగ్‌పూర్
మూడో టెస్టు: డిసెంబర్ 2 నుంచి 6 వరకు ; వేదిక: ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ
♦ వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే: డిసెంబర్ 10; వేదిక: హెచ్‌పీసీఏ స్టేడియం, ధర్మశాల
రెండో వన్డే: డిసెంబర్ 13; వేదిక పీసీఏ స్టేడియం, మోహాలీ, చంఢీఘర్
మూడో వన్డే: డెసెంబర్ 17; వేదిక ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్టణం
♦ టీ20 సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20: డిసెంబర్ 20; బారాబతి స్టేడియం, కటక్
రెండో టీ20: డిసెంబర్ 22; హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్
మూడో టీ20: డిసెంబర్ 24: వాంఖడే స్టేడియం, ముంబై
♦ జట్లు:
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, విజయ్, శిఖర్ ధావన్, చతేశ్వర పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్రజడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్‌షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్‌శర్మ
శీల్రంక: దినేశ్ చండిమల్( కెప్టెన్), డిక్‌వెల్లా, లాహిరు గామెజ్, కరుణరత్నే, మాథ్యూస్, సదీరా సమరవిక్రమా, దసన్ శనకా, లాహీరు తిరుమణ్నే, ధనంజయ డిసిల్వా, విశ్వ ఫెర్నాండో, రంగనా హెరాత్, సురంగ లక్మల్, దిర్లువన్ పెరేరా, లక్షణ్ సందకన్, రోషన్ సిల్వా
Comments
Please login to add a commentAdd a comment