న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయంతో జోష్ మీదున్న టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. పితృత్వ సెలవుపై పింక్‌బాల్ టెస్టు అనంతరం భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగా... ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆసీస్ గడ్డపై సత్తా చాటిన రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆరంభం కానున్న టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్ మీకోసం..
4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్
►ఇంగ్లండ్‌తో జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది.
వేదికలు: చెన్నై, అహ్మదాబాద్
►చెన్నై(ఎంఏ చిదంబరం స్టేడియం)లో ఇరు జట్ల మధ్య తొలి రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
►మూడో టెస్టు(డే అండ్ నైట్), నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది.
తొలి టెస్టు: ఫిబ్రవరి 5-9, చెన్నై(ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభం)
రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, చెన్నై(ఉదయం 9.30)
మూడో టెస్టు(డే/నైట్): ఫిబ్రవరి 24-28, అహ్మదాబాద్(మధ్యాహ్నం 2.30 నిమిషాలు)
నాలుగో టెస్టు: మార్చి 4-8, అహ్మదాబాద్(ఉదయం 9.30 నిమిషాలు)
ఐదు టీ20 మ్యాచ్‌లు అక్కడే!
►భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం అందించనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఇక ఇక్కడ కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో 5 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
తొలి టీ20: మార్చి 12, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: మార్చి 14
మూడో టీ20: మార్చి 16
నాలుగో టీ20: మార్చి 18
ఐదో టీ20: మార్చి 20
మూడు వన్డేలు
►టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పుణె వేదిక కానుంది.
తొలి వన్డే: మార్చి 23 (మధ్యాహ్నం 1.30 నిమిషాలు)
రెండో వన్డే: మార్చి 26
మూడో వన్డే: మార్చి 28
తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఖరారు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.(చదవండి: భారత క్రికెటర్లకు కొత్త ఫిట్‌నెస్ పరీక్ష)
తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ జట్టు:
జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్‌క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, బెన్‌స్టోక్స్, ఓలీ స్టోన్, డామ్ సిబ్లే, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జేమ్ అండర్సన్
Comments
Please login to add a commentAdd a comment