![Ind vs Eng Kohli Likely to Join Squad For 5th Test While Anushka: Report - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/13/viratanushka.jpg.webp?itok=9fQ81v4L)
Is Problem In Anushka Sharma Pregnancy, Rumours Viral: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. అదీ సొంతగడ్డపై అంటే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మెరుపులు ఉండాల్సిందే! ప్రత్యర్థి బజ్‌బాల్ అంటూ హెచ్చులకు పోతే.. అందుకు మన కింగ్ దూకుడైన ‘విరాట్‌బాల్’తో అడ్డుకట్ట వేయడం ఖాయం.. అంటూ ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా తప్పుకొన్న విషయం తెలిసిందే. కోహ్లి లేకుండానే జరిగిన ఈ మ్యాచ్‌లలో తొలుత ఇంగ్లండ్.. తర్వాత టీమిండియా గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.
సెలక్షన్‌కు అందుబాటులో లేడు
ఇక మూడో టెస్టు నుంచైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడనుకుంటే.. అతడి విజ్ఞప్తి మేరకు సెలవు పొడిగించినట్లు ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లి గోప్యతకు భంగం కలగకుండా.. అతడు తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని జట్టు ప్రకటించిన సందర్భంలో తెలిపింది.
మాట మార్చిన డివిలియర్స్
మరోవైపు.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ధ్రువపరిచిన సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ తర్వాత మాట మార్చాడు. తాను తప్పుడు సమాచారం వ్యాప్తి చేశానని.. కోహ్లి దంపతులను క్షమాపణ కోరాడు. దీంతో అసలు కోహ్లి కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ కలవరపాటుకు గురవుతున్నారు.
విరుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలంటూ వదంతులు
ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్ వారి ఆందోళనను రెట్టింపు చేసేలా పోస్ట్ పెట్టారు. ఏబి డివిలియర్స్ విరుష్క జోడీ గురించి చెప్పింది నిజమే.. కానీ అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని.. అందుకే వాళ్లు విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని సదరు పోస్ట్ సారాంశం.
ఈ క్రమంలో అనుష్క శర్మ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాంటి బ్యాడ్‌న్యూస్ వినాలనుకోవడం లేదంటూ విరుష్క కోసం తాము ప్రార్థిస్తామని పేర్కొంటున్నారు.
ఊరట కలిగించే అప్‌డేట్
మరోవైపు.. తాజాగా ఓ బీసీసీఐ ఒకరు పీటీఐతో మాట్లాడుతూ ఇచ్చిన అప్‌డేట్ విరాట్ కోహ్లి అభిమానులకు ఊరట కలిగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని.. జట్టుతో తిరిగి చేరతాడని సదరు అధికారి పేర్కొనడం విశేషం. దీంతో అంతా బాగుంది గనుకే కోహ్లి తిరిగి మైదానంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. తర్వాత రాంచి(ఫిబ్రవరి 23 నుంచి)లో నాలుగో, ధర్మశాల(మార్చి 7 నుంచి) ఐదో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి!
Comments
Please login to add a commentAdd a comment