Ind vs Eng Tests: కోహ్లి రీఎంట్రీ డౌటే!.. అసలు కారణాలేంటి? | BCCI To Announce Squad For Remaining 3 Tests vs Eng, Will Kohli Return | Sakshi

Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!?

Published Tue, Jan 30 2024 12:25 PM | Last Updated on Tue, Jan 30 2024 1:14 PM

BCCI To Announce Squad For Remaining 3 Tests vs Eng Will Kohli Return - Sakshi

Ind vs Eng Test Series 2024: బజ్‌బాల్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపు జెండా ఎగురవేసింది ఇంగ్లండ్‌. హైదరాబాద్‌ మ్యాచ్‌లో ఆరంభంలో తడబడ్డా ఆఖరికి విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇక ఊహించని రీతిలో ఓటమిపాలైన రోహిత్‌ సేనకు రెండో టెస్టుకు ముందే మరో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సహా కీలక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.

ఆ ముగ్గురికి పిలుపు
ఈ నేపథ్యంలో వైజాగ్‌లో జరిగే టెస్టు కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు పిలుపు వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు కూడా జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.

ఇందుకోసం సెలక్టర్లు మంగళవారం(జనవరి 30) భేటీకాన్నుట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

కోహ్లి రీఎంట్రీ ఇస్తాడా.. అసలు ఎందుకు దూరమయ్యాడు?
అయితే, కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి దూరమయ్యాడని మేనేజ్‌మెంట్‌ చెప్పినప్పటికీ.. అందుకు గల అసలు కారణంపై ఇంత వరకు స్పష్టత రాలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో విభేదాలంటూ రూమర్లు వస్తున్నప్పటికీ.. అవన్నీ వట్టి పుకార్లే అని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి.

ఈ క్రమంలో.. భార్య అనుష్క శర్మ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వ్యక్తిగతంగా ఆమెకు దగ్గరగా ఉండేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు అంటున్నారు. కాగా అనుష్క ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ ఇప్పటికే కొన్ని ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఏదేమైనా కోహ్లి ఆఖరి మూడు టెస్టులకు అందుబాటులోకి రాకుంటే టీమిండియాకు మాత్రం తిప్పలు తప్పవు.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్‌డేటెడ్‌):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. 

చదవండి: విరాట్‌ను చూసి నేర్చుకోవాలి: కోహ్లిపై రోహిత్‌ శర్మ ప్రశంసలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement