
కోల్‌కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లు తమ వ్యూహాలను కెప్టెన్ కోహ్లితో కలిసి డిన్నర్ టేబుల్‌పైనే రచించారు. మూడో రోజు ఆటలో ఆధిక్యం సాధించిన లంకను దెబ్బ కొట్టేందుకు కెప్టెన్ కోహ్లి డిన్నర్ సమయంలో ఓపెనర్లతో కలిసి ప్రణాళిక సిద్దం చేశారు. ఈ విషయాన్ని ధావన్ ‘బాయ్స్‌తో గొప్ప డిన్నర్ .. నాలుగో రోజు ఆట మా వైపు తిప్పుకునేందుకు వ్యూహాన్ని రచించాం’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ ప్రణాళిక దగ్గట్టు టీమిండియా లంక తొలి ఇన్నింగ్స్‌ను 294 పరుగులకే కట్టడి చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అర్ధసెంచరీలతో మెరిసిన ఈ జంట తొలి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్(94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రాహుల్(73) నాటౌట్‌గా నిలిచాడు.