India vs South Africa 2022: Reports Says Shikhar Dhawan Informed by Head Coach Rahul Dravid Before Omission - Sakshi
Sakshi News home page

IND Vs SA T20 Series: ధావన్‌ ఎంపికలో అన్యాయం.. కేఎల్‌ రాహుల్‌ జోక్యంలో నిజమెంత?

Published Tue, May 24 2022 11:16 AM | Last Updated on Tue, May 24 2022 1:49 PM

Reports Shikhar Dhawan Informed-by Coach Rahul Dravid Before Omission - Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌కు టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ధావన్‌ను సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. యువ ఆటగాళ్లకు చాన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధావన్‌కు రెస్ట్‌ ఇచ్చామని బీసీసీఐ చెప్పిన కారణంపై విమర్శలు వస్తున్నాయి. ఎంత యువ జట్టైనా ఒక సీనియర్‌ ఆటగాడు ఉంటే అతని అనుభవం జట్టుకు పనికి వస్తుందని చాలా మంది అభిఫ్రాయపడ్డారు.

అయితే షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. ధావన్‌కు చెప్పి మరీ జట్టు నుంచి పక్కనబెట్టినట్లు తెలిసింది. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా ధావన్‌తో మాట్లాడినట్లు తేలింది. రానున్న టి20 ప్రపంచకప్‌ 2022 దృష్టిలో పెట్టుకొని యంగస్టర్స్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు ధావన్‌ మొదట ఒప్పుకోకపోయినప్పటికి.. ద్రవిడ్‌ రంగ ప్రవేశంతో చివరికి ధావన్‌ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే నిజమైతే ధావన్‌కు అన్యాయం జరిగినట్లేనని క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు. ఇంకో విషయమేంటంటే.. ప్రొటీస్‌తో టి20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్‌  జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో నిండిపోవాలని కోరుకున్నాడని.. అందుకే జట్టు ఎంపికకు ముందే కోచ్‌ ద్రవిడ్‌ ద్వారా ధావన్‌కు విషయాన్ని చేరవేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 

ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టు ప్లే ఆఫ్‌ చేరడంలో విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మాత్రం సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో మూడు అర్థశతకాలతో 460 పరుగులు సాధించాడు. బట్లర్‌, కేఎల్‌ రాహుల్‌, డికాక్‌ తర్వాతి స్థానం శిఖర్‌ ధావన్‌దే కావడం విశేషం.​

చదవండి: Cheteshwar Pujara On IPL 2022: 'ఐపీఎల్‌లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా'

IND Vs SA T20: డీకేను సెలక్ట్‌ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement