IPL 2023: PBKS Vs LSG Match 38 Live Updates And Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 PBKS Vs LSG : 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఘన విజయం

Published Fri, Apr 28 2023 7:10 PM | Last Updated on Fri, Apr 28 2023 11:40 PM

IPL 2023: PBKS Vs LSG Match Live-Updates-Highlights - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19.5 ఓవర్లలో  201 పరుగులకు ఆలౌట్‌ అయింది. అథర్వ తైదే 33 బంతుల్లో 66 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారిలో సికందర్‌ రజా 36, జితేశ్‌ శర్మ 24 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో యష్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లు తీయగా.. నవీన్‌ ఉల్‌ హక్‌ మూడు, రవి బిష్ణోయ్‌ రెండు, స్టోయినిస్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

16 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 166/5
16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌ 15, జితేశ్‌ శర్మ 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 23 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్‌ రవిబిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

టార్గెట్‌ 258.. నాలుగో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
258 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అథర్వ టైడే(33 బంతుల్లో 66 పరుగులు) రవి బిష్ణోయి బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

6 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 55/2
6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. అథర్వటైడ్‌ 32, సికిందర్‌ రజా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టార్గెట్‌ 258.. 3 ఓవర్లలో పంజాబ్‌ స్కోరెంతంటే?
3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ ఒక్క పరుగు మాత్రమే చేసి స్టోయినిస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు.. పంజాబ్‌ టార్గెట్‌ 258
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ భారీ స్కోరు చేసింది.  పంజాబ్‌ బౌలర్లను చీల్చిచెండాడిన లక్నో నిర్ణీత 20 ఓవర్ల ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేసిన స్కోరు రెండో అత్యధిక కావడం విశేషం.

ఇంతకముందు ఆర్‌సీబీ 263 పరుగుల స్కోరుతో టాప్‌లో ఉంది. లక్నో బ్యాటర్లలో స్టోయినిస్‌ 40 బంతుల్లో 72, కైల్‌ మేయర్స్‌ 24 బంతుల్లో 54, నికోలస్‌ పూరన్‌ 19 బంతుల్లో 45, ఆయుష్‌ బదోని 24 బంతుల్లో 43 పరుగులతో విధ్వంసం సృష్టించారు. పంజాబ్‌ బౌలర్లలో  అందరు బారీగా పరుగులిచ్చుకోగా.. రబాడ ఒక్కడే 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌, సామ్‌ కరన్‌, లివింగ్‌స్టోన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. లక్నో బ్యాటర్ల దెబ్బకు ధావన్‌ మ్యాచ్‌లో ఏడుగురితో బౌలింగ్‌ చేయించడం గమనార్హం.

స్టోయినిస్‌ ఫిఫ్టీ..  లక్నో 17 ఓవర్లలో 216/3
మార్కస్‌ స్టోయినిస్‌ అర్థసెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు పూరన్‌ కూడా చెలరేగుతుండడంతో లక్నో 200 మార్క్‌ను అందుకుంది.  ప్రస్తుతం 17 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. స్టోయినిస్‌ 61, పూరన్‌ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారీ స్కోరు దిశగా లక్నో.. 13 ఓవర్లలోనే 156/2
పంజాబ్‌ కిం‍గ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. స్టోయినిస్‌ 26 బంతుల్లో 47 పరుగులు, ఆయుష్‌ బదోని 22 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లలో లక్నో 111/2
9  ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. బదోని 23, స్టోయినిస్‌ 16 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 24 బంతుల్లో 54 పరుగులు చేసిన కైల్‌ మేయర్స్‌ రబాడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

కేఎల్‌ రాహుల్‌(12)ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
12 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ రబాడ బౌలింగ్‌లో షారుక్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 45 పరుగులు చేసింది. మేయర్స్‌ 27, ఆయుష్‌ బదోని 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

3 ఓవర్లలో లక్నో 35/0
మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ వికెట్‌ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 27, ​కేఎల్‌ రాహుల్‌ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో మొహలీ వేదికగా 38వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్‌ కీపర్‌), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, శిఖర్ ధావన్(కెప్టెన్‌), సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రెగ్యులర్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ తిరిగి జట్టులోకి రావడం పంజాబ్‌కు బలమని చెప్పొచ్చు. ఇక ల‌క్నో ఆఖ‌రి ఓవ‌ర్లో గుజ‌రాత్ టైట‌న్స్ చేతిలో కంగుతిని ఓటమిపాలైంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బ‌ల‌మైన ముంబై ఇండియ‌న్స్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.

ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఇరుజ‌ట్లు నాలుగు విజ‌యాలు సాధించాయి. లక్నో ఆట‌గాళ్లు కైల్‌ మేయర్స్‌, నికోల‌స్ పూర‌న్, స్టోయినిస్ నిల‌క‌డ‌గా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ ఓపెన‌ర్ ప్ర‌బ్‌సిమ్రాన్ సింగ్,  సామ్ క‌ర‌న్‌, అర్ష్‌దీప్ సింగ్ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. దాంతో, ఈమ్యాచ్‌లో ఎవ‌రు పై చేయి సాధిస్తారో మ‌రికొన్నిగంట‌ల్లో తెలియ‌నుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement