ఐపీఎల్-2023 సీజన్ మధ్య నుంచి లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ గాయం కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడి స్థానాన్ని ముంబైకు చెందిన యువ క్రికెటర్ సూర్యన్ష్ షెడ్జ్‌తో లక్నో భర్తీ చేసింది. ఈ ఆల్‌రౌండర్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా 20 ఏళ్ల సూర్యన్ష్ 2022-23 రంజీ సీజన్‌కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అయితే ఈ టోర్నీలో అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకు కూడా ముంబై జట్టులో చోటు దక్కింది. ఇక్కడ కూడా సూర్యన్ష్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటి వరకు అతడికి ముంబై సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. కానీ గతేడాది డిసెంబర్‌లో జరిగిన బీసీసీఐ మెన్స్ అండర్ 25 స్టేట్-ఏ ట్రోఫీలో సూర్యన్ష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 184 పరుగులు చేశాడు. ఇక లక్నో విషయానికి వస్తే.. ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. మే 20న కేకేఆర్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సూపర్ జెయింట్స్ ఫ్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు.
చదవండి: #Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment