PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిలీ రోసో (37 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో సామ్‌కర్రాన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.
ఆతర్వాత 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగల్గింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న లివింగ్ స్టోన్ 9 సిక్స్‌లు, 5 ఫోర్లుతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తైడే 55 పరుగులు చేశాడు.
ధావన్ చెత్తకెప్టెన్సీ
ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధి శిఖర్ ధావన్ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తమ బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలోధావన్ తేలిపోయాడు. ముఖ్యంగా క్రీజులో రిలీ రోసో వంటి విధ్వంసకర లెఫ్ట్‌ఆర్మ్ బ్యాటర్ ఉన్నప్పడు ధావన్ ఆఖరి ఓవర్ వేసేందుకు అర్ష్‌దీప్‌ను కాదని స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను తీసుకువచ్చాడు.
ధావన్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇదే పంజాబ్ కొంపముంచింది. చివర్ వేసిన బ్రార్ ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రార్ స్థానంలో అర్ష్‌దీప్‌ను తీసుకువచ్చి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదాని పలువరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక ధావన్ చెత్త కెప్టెన్సీ వల్లే పంజాబ్ ఓడిపోయింది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ధావన్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు.
చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment