IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఔట్‌ | IPL 2023: Delhi Capitals Vs Punjab Kings Live Updates-Highligts | Sakshi
Sakshi News home page

IPL 2023 DC Vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఔట్‌

Published Sat, May 13 2023 7:15 PM | Last Updated on Sat, May 13 2023 11:11 PM

IPL 2023: Delhi Capitals Vs Punjab Kings Live Updates-Highligts - Sakshi

IPL 2023: Delhi Capitals Vs Punjab Kings Live Updates

పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఔట్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. ప్లేఆఫ్‌ అవకాశాలు ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగింది.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 54 మినహా మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాలుగు వికెట్లు తీయగా.. నాథన్‌ ఎల్లిస్‌, రాహుల్‌ చహర్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌
16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రవీణ్‌ దూబే 15, కుల్దీప్‌ యాదవ్‌ ఒక పరుగుతో ఆడుతున్నారు.

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 91/6

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 86/5

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 86/4

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 82/3

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 80/2

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 74/2

ప్రబ్‌సిమ్రన్‌ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ 168
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 65 బంతుల్లో 103 పరుగులు సెంచరీతో మెరవగా.. సామ్‌కరన్‌ 20 పరుగుల చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, ప్రవీణ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

15 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 117/4
15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 69, హర్‌ప్రీత్‌ బ్రార్‌ క్రీజులో ఉన్నారు. అంతకముందు 20 పరుగులు చేసిన సామ్‌ కరన్‌ ప్రవీణ్‌ దూబే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

12 ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌ 93/3
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 49, సామ్‌ కరన్‌ 17  పరుగులతో క్రీజులో ఉన్నారు.

6 ఓవర్లలో పంజాబ్‌ స్కోరు 46/3
ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 21, సామ్‌ కరన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌ కింగ్స్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన ధావన్‌ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో రిలీ రొసౌకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ 5, లివింగ్‌స్టోన్‌ నాలుగు పరుగులతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శనివారం ఢిల్లీ వేదికగా 59వ మ్యాచ్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

మధ్యలో రెండు విజయాలతో గాడినపడ్డట్లే కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ పరాజయాల బాట పట్టింది.మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్‌ కింగ్స్‌ కాస్త నయంగా కనిపిస్తోంది. ఇరుజట్లు గతంలో 30సార్లు తలపడగా.. చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement