
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్‌గార్డన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన పంజాబ్ కింగ్స్.. చివరి బంతికి ఓటమి చవిచూడల్సి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
చివరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో రింకూ సింగ్ ఫోర్ కోట్టి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. "ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసినందుకు చాలా బాధగా ఉంది. ఈడెన్ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ కేకేఆర్ మా కంటే బాగా ఆడారు. అయితే అర్ష్‌దీప్ సింగ్ మాత్రం అద్భుతమైన ప్రయత్నం చేశాడు.
మ్యాచ్‌ను ఆఖరి బంతివరకు తీసుకువెళ్లాడు. కాబట్టి మేము ఓడిపోయినా క్రెడిట్ మాత్రం అర్ష్‌దీప్‌కు ఇవ్వాలని అనుకుంటున్నాను. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లను అడ్డుకునేందుకు మా జట్టులో మంచి హాఫ్ స్పిన్నర్లలు లేరు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
చదవండి: KKR VS PBKS: విజయానందంలో ఉన్న నితీశ్ రాణాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment