Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికి 9 మ్యాచ్‌లాడి 356 పరుగులు చేయడం విశేషం. ధావన్ ఖాతాలో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. అయితే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం గబ్బర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చి అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు.
ఇప్పటివరకు ఓపెనర్‌గా ధావన్(తాజా దానితో కలిపి) పదిసార్లు డకౌట్ కాగా.. తొలి స్థానంలో పార్థివ్ పటేల్ 11 సార్లు ఓపెనర్‌గా డకౌట్ అయ్యాడు. ధావన్‌తో కలిసి గౌతమ్ గంభీర్, అజింక్యా రహానేలు కూడా పదిసార్లు డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ తొమ్మిదిసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment