సాక్షి, హైదరాబాద్: ‘యూ ఆర్ న్యూ మిష్టర్ డిపెండబుల్’ అంటూ టీమిండియా టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ చతేశ్వర పుజారాను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ వైపు వికెట్లు పడుతున్న తన దైన శైలిలో ఆడుతూ పుజారా అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 172 పరుగులకు ఆలౌట్ అయింది.
ఏ మాత్రం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై తన మార్క్ బ్యాటింగ్‌తో టెస్ట్ కెరీర్‌లో 16 అర్ధ సెంచరీ సాధించిన పుజారాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక పుజారా హాఫ్ సెంచరీకి డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సభ్యులు నిలబడి ప్రశంసించడం విశేషం. ఈ అర్ధ సెంచరీకి 117 బంతులాడిన పుజారా 10 ఫోర్లు కొట్టడం మరో విషేశం. ఒకప్పుడు మిష్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అయితే యూ ఆర్ న్యూ డిపెండబుల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. పుజారా హాఫ్ సెంచరీని ప్రశంసిస్తూ బీసీసీఐ ‘ఓపిక, భరోసా.. పుజారా 16వ హాఫ్‌సెంచరీ’ అని ట్వీట్ చేసింది.
Patient and poised - @cheteshwar1 gets to his 16th Test 50 #INDvSL pic.twitter.com/AlBe0NzZKm
— BCCI (@BCCI) November 18, 2017
That's why @cricketaakash call him Cheteshwar "dependable" pujara ✌✌@BCCI @cricketaakash
— Kamalkant Jangir (@Kamalkantkakku7) 18 November 2017
Comments
Please login to add a commentAdd a comment