భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా మరోసారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తాచాటాడు. పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 348 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 22 ఫోర్లు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 18వ డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాకుండా పుజారా ఈ ఇన్నింగ్స్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
ఈ ఘనతను సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా పూజారా నిలిచాడు. ఈ జాబితాలో పూజారా కంటే ముందు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అదే విధంగా ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పూజారా నాలుగో స్ధానానికి ఎగబాకాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో డాన్ బ్రాడ్‌మన్(37) అగ్రస్ధానంలో ఉండగా .. తర్వాతి స్ధానాల్లో వాలీ హమండ్(36), హెన్రడన్(22), పూజారా(18) కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment