రంజీట్రోఫీ 2023-24 సీజన్‌లో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజరా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. పుజారా తాజాగా మరో ఫస్ట్ క్లాస్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్దంగా టీ20 తరహాలో ఆడాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ప్రస్తుత సీజన్‌లో ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన పుజారా 77 సగటుతో తో 673 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. కాగా పుజారా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చివరిగా భారత తరపున ఆడాడు. అయితే పుజారా ప్రస్తుత ఫామ్‌ను చూస్తే రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
కాగా భారత్ తరపున టెస్టుల్లో పుజారాకు ఘనమైన రికార్డు ఉంది. 103 టెస్టుల్లో పుజారా 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌లో 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ఆయనొక టీమిండియా మాజీ కెప్టెన్.. ఇదేనా మీరేచ్చే గౌరవం?
Comments
Please login to add a commentAdd a comment