పుజారా మరో రికార్డు | pujara gets another record | Sakshi
Sakshi News home page

పుజారా మరో రికార్డు

Published Sun, Mar 26 2017 2:53 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

పుజారా మరో రికార్డు

పుజారా మరో రికార్డు

ధర్మశాల: ఆసీస్ తో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాడు చటేశ్వర పుజారా ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులను ఆడిన స్వదేశీ ఆటగాడి రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 525 బంతులు ఆడిన పుజారా.. రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న 495 బంతుల రికార్డును అధిగమించాడు. కాగా, చివరిదైన నాల్గో టెస్టులో పుజారా మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా(57;151బంతుల్లో 6 ఫోర్లు) అర్థ శతకం సాధించాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పుజారా నిలిచాడు.

 

తాజా హాఫ్ సెంచరీతో 2016-17 సీజన్ లో పుజారా సాధించిన టెస్టు పరుగులు 1316. దాంతో గౌతం గంభీర్(1269) రికార్డును పుజారా బ్రేక్ చేశాడు. 2008-09 సీజన్లో గంభీర్ అత్యధిక పరుగుల్ని నమోదు చేసిన రికార్డును సాదించాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆ రికార్డును పుజారా సవరించాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్ కు దూరంగా ఉన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక సీజన్ అత్యధిక పరుగుల్లో మూడో స్వదేశీ ఆటగాడిగా ఉన్నాడు.  ఈ సీజన్ లో కోహ్లి నమోదు చేసిన పరుగులు 1252. మరొకవైపు ఓవరాల్గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1483 పరుగులు ) తొలి స్థానంలో ఉన్నాడు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement